అతడికే ఫస్ట్ కిస్ ఇచ్చా.. నన్ను ఆ మాట అనడంతో వాళ్ల ముందే కొట్టా: ఆరియానా సీక్రెట్ లీక్
ప్రస్తుత పరిస్థితుల్లో న్యూస్ ఛానెళ్ల కంటే యూట్యూబ్‌లో ఉన్న ఛానెళ్లే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే అందులో పని చేసే వాళ్లకే భారీ స్థాయిలో పాపులారిటీ వస్తోంది. ఇలా చాలా మంది ఇప్పటికే విశేషమైన గుర్తింపును అందుకుని సత్తా చాటారు. ఇటీవలి కాలంలో ఇదే జాబితా నుంచి వచ్చి.. ఊహించని రీతిలో ఫేమస్ అయింది ప్రముఖ యాంకర్ ఆరియానా గ్లోరీ. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లడం వల్లే ఇది జరిగిందన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన ఫస్ట్ కిస్ గురించి సీక్రెట్ లీక్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఫేమ్.. షో ఛాన్స్
యూట్యూబ్ యాంకర్‌గా పని చేసిన తక్కువ సమయంలోనే బాగా ఫేమస్ అయింది ఆరియానా గ్లోరీ. తన కెరీర్‌లో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసిన ఆమె.. కొన్ని రోజుల క్రితం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో బోల్డుగా వ్యవహించడం.. ఆయన కూడా పచ్చి పచ్చిగా మాట్లాడడం వంటి వాటితో పాపులరై బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసింది.

సీక్రెట్‌గా వెళ్లింది.. అల్లరి అల్లరి చేసి షాకిచ్చింది
ఇటీవల ప్రసారం అయిన నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపికైనా ఆరియానా గ్లోరీ.. అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మిగిలిన హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్న ఆమె.. అల్లరి అల్లరి చేస్తూ తన హవా చూపించింది. రెండు రోజుల తర్వాత హౌస్‌లోకి వెళ్లి రచ్చ రచ్చ చేసింది. దీంతో కంటెస్టెంట్లందరూ ఆమెను దూరం పెట్టారు.

టాస్క్ కోసం ఎంతటి పనైనా చేస్తూ హాట్ టాపిక్
ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్‌లో ఎంత సరదాగా ఉండేదో.. టాస్కుల సమయంలో మాత్రం అంతే సీరియస్‌గా కనిపించేది. తాను గెలవడం కోసం ఎంతటి పనైనా చేసే ఆమె.. ఎన్నోసార్లు స్వార్ధంగా ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు, మరికొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఇలా పలు గొడవల్లో భాగమై హాట్ టాపిక్ అయింది.
Keerthy Suresh At Her Close Friend wedding Photos

అంచనాలు లేవు.. ఫినాలేలో చోటు... ఫోర్త్ ప్లేస్
అసలే మాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. కానీ, ఊహించని రీతిలో ఆమె ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకుంది. అంతేకాదు.. ఏకంగా ఫినాలేలో అడుగు పెట్టింది. ఒకానొక దశలో ఆమెనే విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

అతడికే ఫస్ట్ కిస్ ఇచ్చా.. అది నా పర్సనల్ అని
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ ఫుల్ బిజీ అయిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా తన ఫస్ట్ కిస్ గురించి లీక్ చేసింది. 'నేను ఒకరికి ముద్దు పెట్టింది నిజమే. కానీ ఎవరో చెప్పను. అది నా పర్సనల్' అని షాకిచ్చింది.

నన్ను ఆ మాట అనడంతో వాళ్ల ముందే కొట్టాను
నీ జీవితంలో ఎవరైనా అమ్మాయిని కొట్టావా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అనూహ్య సమాధానం చెప్పింది ఆరియానా. 'నేను కాలేజ్‌లో ఉన్న సమయంలో ఓ అమ్మాయి నా గురించి చెడుగా మాట్లాడింది. దారుణమైన మాట అన్నది. దీంతో వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి గొడవపడ్డాను. అంతేకాదు, ఆమెను అందరి ముందే బాగా కొట్టాను' అని వివరించిందీ బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











