twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీరియస్‌లీ.. అరియానా హీరోయిన్‌గానా.. టీవీ ఆఫర్స్ వచ్చినా లెక్క చేయడం లేదా?

    |

    బిగ్ బాస్ సీజన్ 4తో ఒక్కసారిగా క్రేజ్ బాంబ్ బ్లాస్ లాంటి క్రేజ్ అందుకుంది అరియానా గ్లోరి. పొట్టి డ్రెస్సుల్లో హౌజ్ లో అమ్మడు ఇతర కంటెస్టెంట్స్ కి పోటీ ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేసింది. గ్లామర్ విషయంలో అరియానా ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. అరియానా మొదట హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడైతే పెద్దగా అంచనాలు లేవు. ఇక బిగ్ బాస్ సీజన్ 4తో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న ఆమె హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి.

     టాప్ 5లో ఉంటుందని ఊహించలేదు

    టాప్ 5లో ఉంటుందని ఊహించలేదు

    బిగ్ బాస్ సీజన్ 4 మొదలైనప్పుడు అరియానా గ్లోరి అనే అమ్మాయి రెగ్యులర్ టీవీ ఆడియెన్స్ కు పెద్దగా తెలియదు. కేవలం రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతోనే సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ అందుకుంది అంతే. ఇక హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆమె చాలా ఎనర్జిటిక్ గా గేమ్ ఆడుతూ వచ్చింది. టాప్ 5లో నిలిస్తుందని ఎవరు కూడా ఊహించలేదు.

     ఫైనల్ 2వరకు ఉండాల్సింది..

    ఫైనల్ 2వరకు ఉండాల్సింది..

    నిజంగా అరియానా చివరలో కొన్ని మిస్టేక్స్ చేయకుంటే గనక ఆమె టాప్ 2లో చేరి ఉండేది. తప్పకుండా ఫైనల్ లిస్టులోకి వస్తుందని అంతా భావించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఫైనల్ కు వచ్చిన రోజు ఆమె గురించి అదే కామెంట్ చేశారు. నువ్వు ఫైనల్ 2వరకు ఉంటావని అనుకున్నాను అంటూ మెగాస్టార్ చేత ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

    హీరోయిన్ గా అడుగులు వేయాలని..

    హీరోయిన్ గా అడుగులు వేయాలని..

    అసలు మ్యాటర్ ఏమిటంటే అరియానా హీరోయిన్ గా అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు యాంకర్ గా ఎంతగానో బిజీగా ఉన్నప్పటికీ ఆమెకు అనుకున్నంత స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చేది కాదట. అయితే ఈ సారి మాత్రం మళ్ళీ యాంకర్ గా ట్రై చేయకుండా కెరీర్ లో మరోస్థాయికి ఎదిగి బిజీ అవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?
    అరియానా లెక్క చేయడం లేదా?

    అరియానా లెక్క చేయడం లేదా?

    హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆమెకు పలు టెలివిజన్ ఛానెల్స్ నుంచి మాత్రం మంచి ఆఫర్స్ వస్తున్నాయట. షోలకు కూడా హోస్ట్ గా చేసే ఆఫర్స్ వస్తున్నాయట. ఆమెతో పాటు అవినాష్ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇద్దరి కాంబినేషన్ లోనే షోలు ప్లాన్స్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆ ఆఫర్స్ ను ఆమె లెక్క చేయడం లేదనే రూమర్స్ వస్తున్నాయి.

    English summary
    Bigg Boss Season 4 has successfully completed a total of 105 days of travel. Bigg Boss, which received a lot of craze as the biggest reality show in the middle of this season, gave some entertainment in the final but never before. Abhijit won the season 4 as expected. However, the Bigg Boss show has set a new record for most votes cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X