For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: నక్కతోక తొక్కిన ఆరియానా గ్లోరీ.. బుల్లితెర చరిత్రలో నేషనల్ రికార్డు

  |

  కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. ఫలితంగా స్టార్‌డమ్‌ను కూడా అందుకుంటోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా ప్రపంచానికి పరిచయం అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షో పుణ్యమా అని బడా సెలెబ్రిటీగా మారిపోయింది.

  అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరియానా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది. దీంతో నేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

   వర్మతో ఇంటర్వ్యూ.. ఫుల్ ఫేమస్

  వర్మతో ఇంటర్వ్యూ.. ఫుల్ ఫేమస్

  ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆయనతో ఆమె బోల్డుగా మాట్లాడిన తీరుతో హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఆమె ఎంతగానో ఫేమస్ అయిపోయింది. దీంతో ఈమె సెన్సేషన్ అయింది.

  బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

  బిగ్ బాస్‌లోకి వెళ్లడంతో పాపులర్

  బిగ్ బాస్‌లోకి వెళ్లడంతో పాపులర్

  సోషల్ మీడియాలో ఆరియానా గ్లోరీ పేరు మారుమ్రోగడంతో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అయితే, ఫినాలేలో ఆమె నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

  వరుస అవకాశాలతో దూకుడుగా

  వరుస అవకాశాలతో దూకుడుగా

  ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఎంతో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించింది. అలాగే, మరిన్ని ప్రాజెక్టులను కూడా అందుకుంటూ ముందుకెళ్తోంది.

  Bigg Boss 6: జబర్ధస్త్‌కు కోలుకోలేని షాక్.. బిగ్ బాస్‌లోకి టాప్ లేడీ కమెడియన్.. హౌస్‌లో రచ్చ రచ్చే

  బిగ్ బాస్ రీఎంట్రీ.. 10 లక్షలకు

  బిగ్ బాస్ రీఎంట్రీ.. 10 లక్షలకు

  బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'లో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరిస్తూ వచ్చింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరుకుంది. అయితే, ఈ సారి మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన రూ. 10 లక్షలు తీసుకుని నాలుగో స్థానంలో నిలిచింది.

  ఆరియానాకు మరో బీబీ ఆఫర్

  ఆరియానాకు మరో బీబీ ఆఫర్

  ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు టీవీల్లో, సినిమాల్లో వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ ఆఫర్‌ను అందుకుంది. అయితే, ఈ సారి కంటెస్టెంట్‌గా కాకుండా ఓ షోను హోస్ట్ చేయడానికి ఆమె సిద్ధం అయిపోయింది.

  ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

  బీబీ కెఫేతో రాబోతున్న బ్యూటీ

  బీబీ కెఫేతో రాబోతున్న బ్యూటీ

  బిగ్ బాస్ ఆరో సీజన్‌ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్వహకులు ఈ సీజన్ కోసం సరికొత్త ప్రయోగాలకు సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగానే స్టార్ మా మ్యూజిక్‌లో 'బిగ్ బాస్ కెఫే' అనే టాక్ షోను సైతం ప్రారంభించబోతున్నారు. దీనికి ఆరియానా గ్లోరీని హోస్టుగా తీసుకు వచ్చారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన దక్కింది.

   ఆరియానా గ్లోరీ నేషనల్ రికార్డు

  ఆరియానా గ్లోరీ నేషనల్ రికార్డు

  ఆరియానా గ్లోరీ ఇప్పుడు 'బిగ్ బాస్ కెఫే'ను హోస్ట్ చేయబోతుంది. దీంతో ఆమె నేషనల్ రికార్డును క్రియేట్ చేయబోతుంది. అదేమిటంటే.. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్, బిగ్ బాస్ బజ్, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లలో పాల్గొంది. ఇప్పుడు నాలుగో సారి ఆ షోలో భాగం కాబోతుంది. ఇలా ఇండియాలో ఎవరూ నాలుగు సీజన్లలో భాగం కాలేదు. దీంతో ఆరియానా రికార్డు కొట్టింది.

  English summary
  Bigg Boss Fame, TV anchor and Actor Ariyana Glory Entered Two Times in Bigg Boss. Now She Hosts Bigg Boss 6 BB Cafe Talk Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X