మేకప్ రూమ్‌లో ఆరియానా గ్లోరీ ఘాటు వీడియో: అలా ఎందుకు చేశావంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ కామెంట్

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తమ తమ టాలెంట్లను బయట పెడుతూ ఎనలేని క్రేజ్‌ను అందుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి ఆరియానా గ్లోరీ ఒకరు. పలు యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేసిన ఈమె.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ ఆఫర్ అందుకున్న ఈ అమ్మడు.. అక్కడ కూడా తన హవా చూపించింది. టైటిల్ విజేతగా నిలవకున్నా ప్రేక్షకులను గెలుచుకుంది. ఇక, ఆరియానా గ్లోరీ తాజాగా మేకప్‌ రూమ్‌లో ఓ హాట్ వీడియో చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఫుల్ పాపులారిటీ

ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఫుల్ పాపులారిటీ


కెరీర్ ఆరంభంలోనే ఎన్నో ఉద్యోగాలను చేసిన ఆరియానా గ్లోరీ.. కొన్నేళ్ల క్రితం యూట్యూబ్ చానెళ్లలో యాంకర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే చాలా మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె గురించి ఏకంగా ఆర్జీవీనే ట్వీట్ చేయడంతో పాపులర్ అయింది.

బిగ్ బాస్ ఛాన్స్... కొత్తగా ఎంట్రీ ఇచ్చినా

బిగ్ బాస్ ఛాన్స్... కొత్తగా ఎంట్రీ ఇచ్చినా

రాంగోపాల్ వర్మ చేసిన పనికి ఎనలేని క్రేజ్‌ను అందుకుంది ఆరియానా గ్లోరీ. దీంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది. ఫలితంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అయితే, అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రెండు రోజులకు మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ చేసింది.

అద్భుతమైన ఆటతో... ఫినాలేలో దెబ్బ

అద్భుతమైన ఆటతో... ఫినాలేలో దెబ్బ

పేరుకు అమ్మాయే అయినా.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల విషయంలో కుర్రాళ్లతో భయంకరంగా పోరాటం చేసింది ఆరియానా. ఈ కారణంగానే ఎన్నో టాస్కుల్లో విజయం సాధించింది. తద్వారా ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. ఇలా చాలా వారాల పాటు ఎలిమినేషన్ తప్పించుకున్న ఈ భామ.. గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, అక్కడ మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

బిగ్ బాస్ వల్ల లాభపడిన బోల్డు బ్యూటీ

బిగ్ బాస్ వల్ల లాభపడిన బోల్డు బ్యూటీ


బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆరియానా గ్లోరీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక, షోలో ఉన్నందుకు గానూ పేరుతో పాటు రూ. 25 లక్షల వరకూ రెమ్యూనరేషన్ వచ్చింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది.

రెండు సినిమాలు.. మరిన్ని షూటింగ్‌లు

రెండు సినిమాలు.. మరిన్ని షూటింగ్‌లు

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలతో పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. దానికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ వెంటనే మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌ ఫోటోలను కూడా వదిలిందామె.

మేకప్ రూమ్‌లో ఆరియానా ఘాటు వీడియో

మేకప్ రూమ్‌లో ఆరియానా ఘాటు వీడియో

బిగ్ బాస్ షో పుణ్యమా అని వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది ఆరియానా. ఇందులో భాగంగానే తాజాగా ఓ షూటింగ్‌లో పాల్గొంది. దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుని కనిపించింది. ఇది చూసిన వారందరూ జూనియర్ ఇలియానా అంటూ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
అలా ఎందుకు చేశావంటూ సోహెల్ కామెంట్

అలా ఎందుకు చేశావంటూ సోహెల్ కామెంట్


ఈ సెల్ఫీ వీడియోలో ఘాటుగా కనిపించిన ఆరియానా.. మరో డ్యాన్స్ వీడియోను సైతం పోస్ట్ చేసింది. ఇందులో ఆమె పిచ్చ పిచ్చగా గెంతులు వేసింది. దీంతో ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్.. 'బాగానే ఉన్నావా? ఏమైందే? ఏమైనా హెల్ప్ చేయమంటావా' అంటూ పంచ్ ఇచ్చాడు. మొత్తానికి అమ్మడు బోల్డుగా కనిపించి షాకిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X