ఆరియానా గ్లోరీ ఖాతాలో అరుదైన ఘనత: తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా రికార్డు

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది బోల్డ్ పాప ఆరియానా గ్లోరీ. అక్కడ ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఫుల్ పాపులర్ అయింది. దీంతో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. బయటకు వచ్చే వరకూ అమ్మడు అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. తద్వారా మంచి పేరును సంపాదించుకుంది. షో తర్వాత ఫుల్ బిజీ అయిన ఆరియానా.. తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఆ ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ను మార్చింది

ఆ ఇంటర్వ్యూ ఆమె కెరీర్‌ను మార్చింది

యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేస్తోన్న సమయంలో ఆరియానా గ్లోరీ అలియాస్ అర్చన ఎంతో మంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసింది. ఇందులో భాగంగానే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతోనూ చిట్ చాట్ నిర్వహించింది. ఆ సమయంలో వ్యవహరించిన తీరుకు ఆయనే ఫిదా అయిపోయాడు. దీంతో ఆమె వీడియోనూ పోస్ట్ చేయడంతో ఆరియానా ఫేమస్ అయింది.

స్పెషల్‌గా ఎంట్రీ.... బోల్డు గర్ల్ అని చెప్పి

స్పెషల్‌గా ఎంట్రీ.... బోల్డు గర్ల్ అని చెప్పి

ఒక్కసారిగా పేరు రావడంతో ఆరియానాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అయితే.. అందరిలా కాకుండా ఆమె సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లింది. అక్కడి నుంచి హౌస్‌మేట్లను ఆడుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే తనను తాను బోల్డు గర్ల్ అంటూ చెప్పుకుంది. అందుకు అనుగుణంగానే వ్యవహరించింది.

అంచనాలు లేకున్నా.. ఫినాలేలో ఎంట్రీ

అంచనాలు లేకున్నా.. ఫినాలేలో ఎంట్రీ

ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది ఆరియానా. ఎంతో మంది టైటిల్ ఫేవరెట్లు ఉన్నా.. అసాధారణ ఆట, టాస్కుల కోసం పోరాటం చేయడంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తద్వారా పలుమార్లు నామినేషన్స్‌ను తప్పించుకోవడంతో పాటు గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టింది. తుది పోరులో మాత్రం నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది.

ఫుల్ బిజీగా ఆరియానా.. వరుస ఆఫర్లు

ఫుల్ బిజీగా ఆరియానా.. వరుస ఆఫర్లు

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ ఫుల్ బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా చాట్లతో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ప్రారంభించింది. అదే సమయంలో కొన్ని సినిమాలు, షోల ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇందులో భాగంగానే రాజ్ తరుణ్‌తో కలిసి నటిస్తున్నట్లు వెల్లడించింది కూడా.

ఆరియానా గ్లోరీ ఖాతాలో అరుదైన ఘనత

ఆరియానా గ్లోరీ ఖాతాలో అరుదైన ఘనత

బిగ్ బాస్ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను అందుకుంది ఆరియానా గ్లోరీ. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అందుకుంది. ఏ షోలో చూసినా ఆమెనే కనిపిస్తోంది. ఇక, ఇటీవలే గోవా వెళ్లి మరీ రాంగోపాల్ వర్మను కూడా కలిసొచ్చింది. అక్కడ అవినాష్, శ్రీముఖి అండ్ టీమ్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరియానా ఖాతాలో అరుదైన ఘనత వచ్చి చేరింది.

బిగ్ బాస్ చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా

బిగ్ బాస్ చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా

గూగుల్‌లో 'Princess of Bigg Boss Telugu' అని టైప్ చేస్తే ఆరియానా గ్లోరీ పేరు చూపిస్తోంది. ఈ విషయం ఆమె వరకూ వెళ్లడంతో దీన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ పెట్టుకుంది. అంతేకాదు, దీనికి 'సీరియస్‌లీ' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో అమ్మడు మరోసారి హాట్ టాపిక్ అయిపోతోంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు గూగుల్ మాత్రం ఆమె పేరును తొలగించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X