Ariyana Glory: అతనితో అరియానా గ్లోరి గ్లామర్ ఫొటోలు.. పెళ్లి చేసుకోనుందా? అనారోగ్యమా?

సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటి అరియానా గ్లోరి ఒకరు. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ఈ చిన్నది బిగ్ బాస్ లో కూడా అలరించింది. అనంతరం పలు సినిమాలు చేసి ప్రస్తుతం షోలతో ఫుల్ బిజీగా మారింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చే ఈ సుందరి తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమెను చూసిన నెటిజన్లకు ఎన్నో రకాల సందేహాలు కలుగుతున్నాయి.

టర్నింగ్ పాయింట్:అరియానా గ్లోరి అంటే తెలియని బిగ్ బాస్ లవర్స్, సోషల్ మీడియా నెటిజన్లు ఉండరనే చెప్పుకోవాలి. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో పలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం గడిపింది క్యూట్ లేడి అరియానా గ్లోరి. ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా మారి.. ఏకంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కించుకుంది. అదే ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది.

Ariyana Glory Latest Glamour Photos At Melbourne And Netizens Trolling

పొగుడుతూ ఓ ట్వీట్:రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన గ్లామరస్ చిన్నది అరియానా గ్లోరి ఎలాంటి బెరుకు లేకుండా కొంటె ప్రశ్నలు వేసింది. అలాగే రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సమాధానాలను చాలా స్పోర్టివ్ గా, ప్రఫెషనల్ గా తీసుకుని సక్సెస్ ఫుల్ గా కొనసాగించింది. అలా అరియానా యాంకరింగ్ ఆర్జీవీని ఇంప్రెస్ చేసింది. అందుకే ఆమె గురించి ట్విటర్ వేదికగా పొగుడుతూ ఓ ట్వీట్ వేశాడు.

Ariyana Glory Latest Glamour Photos At Melbourne And Netizens Trolling

ముక్కుసూటి తనం:రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక్క ట్వీట్ తో తెగ పాపులారిటీ తెచ్చేసుకుంది ముద్దుగుమ్మ అరియానా గ్లోరి. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో అవకాశం దక్కించుకుంది. ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన అరియానా తన అందం, ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ, అబ్బాయిలకు పోటీ ఇచ్చి ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

Ariyana Glory Latest Glamour Photos At Melbourne And Netizens Trolling

బీబీతో అనుబంధం:బిగ్ బాస్ ద్వారా అరియానా గ్లోరికి మరింత క్రేజ్ రావడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ నటించిన సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే అవేవి ఆమె కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. తర్వాత మళ్లీ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంది. అనంతరం బీబీ కేఫ్ కు హోస్ట్ గా, జోడీ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేసింది.

Ariyana Glory Latest Glamour Photos At Melbourne And Netizens Trolling

గుర్తు పట్టకుండా:బీబీ జోడీలో ముక్కు అవినాష్ తో జత కట్టిన అరియానా గ్లోరి రన్నరప్ గా నిలిచింది. ఈ షోలతోపాటు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్, ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా మెహబూబ్ తో కలిసి ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ సిటీలో దిగిన ఫొటోలను షేర్ చేసింది అరియానా. అయితే ఇందులో ఆమె అస్సలు గుర్తు పట్టలేని విధంగా కనిపించడంతో అభిమానులతోపాటు నెటిజన్లు షాక్ అయ్యారు.

నమిత ముఖానికి:అరియానా గ్లోరి తాజా ఫొటోల్లో కొంచెం బొద్దుగా, డబుల్ చిన్ తో కనిపించింది. 'అరియానా బాగా లావు అయ్యావ్. నమిత బాడీకీ అరియానా ఫేస్ పెట్టినట్లుంది', 'మీ ఫేస్ ఎందుకు అలా అయిపోయింది', 'ఏదైనా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నావా?', 'షూటింగ్ లకు గుడ్ బై చెప్పి పెళ్లి కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా ఏంటీ?' 'అది అసలు నువ్వేనా?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X