For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ariyana Glory: బెడ్ పై వయ్యారంగా అరియానా గ్లోరి అందాలు.. నువ్ తప్పించుకోలేవంటూ

    |

    గతంలో ఇంటర్వ్యూలు టీవీ ఛానెళ్లలోనే కనిపించేవి. అయితే, యూట్యూబ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో ఛానెళ్లు పుట్టుకొచ్చాయి. వీటి వల్ల చాలా మంది యాంకర్లు కూడా వెలుగులోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో బోల్డు గర్ల్ ఆరియానా గ్లోరి ఒకరు. యూట్యూబ్ యాంకర్‌ నుంచి చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో ఆరియానా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిపై ఓ లుక్కేయండి !

    ఒక్క ట్వీట్ తో..

    ఒక్క ట్వీట్ తో..


    హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆ తర్వాత ఆరియానా గ్లోరి యూట్యూబ్ యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆయనతో బోల్డుగా మాట్లాడి తెగ హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఏకంగా ఆరియానా గురించి ట్వీట్ చేయడంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగింది. ఫలితంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

    బోల్డ్ నెస్ తోపాటు..

    బోల్డ్ నెస్ తోపాటు..

    ఒక్కసారిగా ఫేమస్ అవడంతో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

    కొన్ని సినిమాల్లో..

    కొన్ని సినిమాల్లో..

    బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఆరియానా గ్లోరి బాగా వాడుకుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తెగ సందడి చేసేసింది.

    ఓటీటీ సీజన్‌లోనూ ఛాన్స్‌..

    ఓటీటీ సీజన్‌లోనూ ఛాన్స్‌..

    బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా.. ఓటీటీ సీజన్‌లోనూ ఛాన్స్‌ అందుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరుకుని రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు 'బీబీ కెఫ్' అనే టాక్ షోతో ఆరియానా మరోసారి తెగ హడావిడి చేస్తోంది.

    సోషల్ మీడియానే కారణం..

    సోషల్ మీడియానే కారణం..

    తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా పేరు మారుమ్రోగడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిన్నది ఇందులో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

    అందాలను ఆరబోస్తూ..

    అందాలను ఆరబోస్తూ..


    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్ అందాలను చూపిస్తూ ఫోజులు ఇస్తోంది. ఫలితంగా ఈమె క్రేజ్ మరింతగా పెరగడంతో పాటు ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతోంది.

    పూల డ్రెస్ లో వయ్యారంగా..

    పూల డ్రెస్ లో వయ్యారంగా..


    తాజాగా ఆరియానా గ్లోరీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో పూల డ్రెస్ వేసుకున్న అరియానా వయ్యారంగా పోజులిచ్చింది. బెడ్ పై వయ్యారంగా పడుకుని తన థైస్, షోల్డర్ అందాలను మత్తుగా ప్రదర్శించింది. ఈ ఫొటోలకు 'నీ మనసు నుంచి తప్పించుకోలేవు. అందుకే దాని మాట వినడం ఉత్తమం' అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఈ చిన్నది. దీంతో ఆరియానా ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.

    English summary
    Bigg Boss Contestant Ariyana Glory Latest Hot Photoshoot On Bed In Flower Printed Sleeveless Dress Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X