ఇప్పుడు చావడానికైనా సిద్దమే.. చావు, పుట్టుకలపై అరియానా ఎమోషనల్

బిగ్‌బాస్ బ్యూటీ, హాట్ యాంకరమ్మ అరియానా గ్లోరీ (Ariyana Glory) మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో గ్లామర్ షోలు, బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో ఎప్పుడూ చర్చల్లో ఉండే అరియానా... ఈసారి మాత్రం తన వ్యక్తిగత జీవితంలోని బాధ, రిలేషన్‌షిప్స్‌లో చేసిన తప్పులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ముఖ్యంగా చావు - పుట్టుకలపై తన భావాలను బయటపెట్టింది. తాజాగా ఆమె పాల్గొన్న'కిసిక్ టాక్' షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

టిక్‌టాక్ వీడియోలు, రీల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న అరియానా, బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ తర్వాత హాట్ ఫొటోషూట్స్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా కొనసాగుతోంది. అయితే.. తాజాగా యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కిసిక్ టాక్స్'లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె హార్ట్ టచ్చింగ్ కామెంట్స్ చేసి, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాయి.

Ariyana Glory Opens Up on Life Death and Relationships in an Emotional Kissik Talk Interview

ఆ తర్వాత యాంకర్ వర్షా అడిగిన ప్రశ్నలకు అరియానా ఒక్కొక్కటిగా తన జీవితంలోని నిజాలను బయటపెట్టింది. 'నా అసలు పేరు అరియానా కాదు... అర్చన'అని చెప్పి షాక్ ఇచ్చింది. పేరు మార్చుకోవడానికి కారణం కూడా చెప్పింది. 'పేరు బాగుంది కానీ, కష్టాలు కూడా అలాగే ఎక్కువగా ఉన్నాయి. అందుకే పేరు మార్చుకున్నాను' అంటూ తన జీవితంలోని చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది.

యాంకరింగ్ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చావని యాంకర్ వర్ష ప్రశ్నించగా.. 'లైఫ్‌లో జరగాల్సింది ముందే రాసి పెట్టి ఉంటుంది. ఒక రోజు నేను, నా చెల్లి కలిసి టీవీ చూస్తుంటే యాంకర్స్ కావాలన్న ప్రకటన వచ్చింది. వెంటనే ఆడిషన్స్‌కు వెళ్లా. అక్కడి నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఇక్కడిదాకా వచ్చాను' అంటూ తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను వివరించింది.

అరియానా అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆర్జీవీ ఇంటర్వ్యూ.. దీనిపై అరియానా స్పందిస్తూ.. 'ఆర్జీవీ గారిని ఇంటర్వ్యూ చేయడం దేవుడు ఇచ్చిన వరం. అప్పటివరకు నేను ఏం సాధిస్తానో కూడా తెలియదు. ఆ ఇంటర్వ్యూనే నా జీవితంలో టర్నింగ్ పాయింట్' అని చెప్పింది. ఒకానొక సమయంలో కేవలం రూ.1800 జీతంతో పనిచేసిన తాను, ఇప్పుడు బెటర్ పొజిషన్‌లో ఉన్నానని చెప్పి తన ప్రయాణాన్ని గుర్తు చేసింది.

ఇక ఆధ్యాత్మిక విశ్వాసాల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'నేను క్రిస్టియన్‌లా పెరిగాను. కానీ ఈ మధ్య ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నాను' అని చెప్పింది. 'దేవుడు ప్రత్యక్షమై వరం అడిగితే ఏం కోరుకుంటావు?' అని వర్షా ప్రశ్నించగా... 'నన్ను వెంటనే తన దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతాను. దేవుడే వచ్చి అడిగితే ఇంకేం కావాలి? నేను ఈ క్షణమైనా చనిపోవడానికి సిద్ధమే' అంటూ అరియానా చేసిన వ్యాఖ్యలు అక్కడున్నవారినే కాదు, ప్రేక్షకులను కూడా ఎమోషనల్ చేశాయి.

ఇక పెళ్లి, రిలేషన్‌షిప్స్ విషయానికి వస్తే అరియానా మరింత ఓపెన్ అయింది. 'నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు రాంగ్ పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడమే. అందరూ చెబుతున్నా వినకుండా 'నేను డిఫరెంట్ యాంగిల్ చూస్తున్నా' అనుకునేదాన్ని. చివరికి వాళ్లే కరెక్ట్ అని అర్థమయ్యేది" అంటూ తన తప్పులను అంగీకరించింది.

ప్రస్తుతం రిలేషన్‌లో లేనని, కానీ రిలేషన్ కావాలనే కోరిక ఉందని చెప్పింది. 'అనవసరమైన గొడవలు అవసరం లేదు. కష్టమైతే ఒంటరిగానే బాగుంటాను. సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతుకుతున్నాను' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం అరియానా కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. అరియానా మాటల్లో దాగి ఉన్న భావోద్వేగాలు, అనుభవాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X