twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యామిలీలోకి ఆరియానా గ్లోరీ: అతడితో కలిసి సెల్ఫీ వీడియో.. సీక్రెట్ లీక్ చేసిన బ్యూటీ

    |

    తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ స్థాయిలో ప్రజాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో వల్ల టెలివిజన్ హిస్టరీలో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో దీని ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యాంకర్‌గా సుపరిచితురాలు అయిన ఈమె.. బిగ్ బాస్ వల్ల ఎంతో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అందులో అద్భుతమైన మాటతో పాటు ముక్కుసూటిగా ఉంటూ ఆకట్టుకోవడంతో మంచి పేరును సైతం అందుకుంది. ఈ షో తర్వాత వరుసగా ఆఫర్లను ఒడిసి పట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరియానా గ్లోరీ మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ సంగతులు మీకోసం!

    అతడి వల్లే పాపులర్ అయిన ఆరియానా

    అతడి వల్లే పాపులర్ అయిన ఆరియానా

    కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించింది ఆరియానా గ్లోరీ అలియాస్ ఆర్చన. ఈ క్రమంలోనే యూట్యూబ్ యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా అందులో ఎంతో మంది సినీ ప్రముఖులతో చిట్ చాట్‌లను నిర్వహించింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఓ సారి ఇంటర్వ్యూ చేసిందామె. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడం హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఈ దెబ్బతో ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులరిటీని సంపాదించుకుంది.

    పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

    బిగ్ బాస్ అవకాశం... ఫినాలేలో అడుగు

    బిగ్ బాస్ అవకాశం... ఫినాలేలో అడుగు

    సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడంతో ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముక్కుసూటిగా ఉంటూ నిజాయితీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. తద్వారా ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను తప్పించుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టింది. అయితే, చివర్లో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందామె. అయినప్పటికీ ఫైటర్‌గా మంచి పేరును సంపాదించుకుని సత్తా చాటింది.

    షో తర్వాత సత్తా.. వరుస ఆఫర్లతో హవా

    షో తర్వాత సత్తా.. వరుస ఆఫర్లతో హవా

    బిగ్ బాస్ షోలో అద్భుతమైన ఆటతో అదరగొట్టిన ఆరియానా గ్లోరీ.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తోంది. ఈ షో పుణ్యమా అని బోల్డు బ్యూటీ ఎంతగానో ఫేమస్ అయింది. దీంతో ఆమెను అభిమానించే వాళ్లు క్రమంగా పెరుగుతున్నారు. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. కొద్ది రోజుల క్రితమే రాజ్ తరుణ్ సినిమాను పూర్తి చేసుకున్న ఆరియానా.. ఇప్పుడు మరో ప్రాజెక్టులోనూ భాగం అయిపోయింది.

    తల్లైనా తగ్గని కరీనా కపూర్: గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న సీనియర్ హీరోయిన్తల్లైనా తగ్గని కరీనా కపూర్: గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపుతోన్న సీనియర్ హీరోయిన్

    ఆర్జీవీ ఇంటర్వ్యూ.. మరోసారి హాట్ టాపిక్

    ఆర్జీవీ ఇంటర్వ్యూ.. మరోసారి హాట్ టాపిక్

    ఆరంభం నుంచి బోల్డుగా వ్యవహరించే ఆరియానా గ్లోరీ.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే తన వ్యక్తిత్వం అలాగే ఉంటుందని చెప్పింది. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వస్తోంది. ఇక, ఈ షో తర్వాత ఆరియానా గ్లోరీ వ్యవహార శైలిలో మరింతగా మార్పులు వచ్చాయి. దీంతో గతంలో కంటే ఎక్కువ బోల్డుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాంగోపాల్ వర్మతో ఘాటు ఇంటర్వ్యూలో పాల్గొంది. వీళ్లిద్దరి మధ్య అందులో జరిగిన సంభాషణలు ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేశాయి. ఈ ఎఫెక్టుతో రాంగోపాల్ వర్మతో పాటు ఆరియానా గ్లోరీ పేరు మరోసారి ట్రెండ్ అయింది.

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

    అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

    ఆరియానా గ్లోరీ ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. ఇక, బిగ్ బాస్ షో తర్వాత ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, గ్లామరస్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుందామె. దీంతో అక్కడా హవా చూపిస్తోంది. ఫలితంగా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను క్రమంగా పెంచుకుంటోంది.

    ఘాటు వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల ఆరబోతఘాటు వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల ఆరబోత

    మెగా ఫ్యామిలీలోకి.. సీక్రెట్ రివీల్ చేసేసింది

    మెగా ఫ్యామిలీలోకి.. సీక్రెట్ రివీల్ చేసేసింది

    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ.. తరచూ సెల్ఫీ వీడియోలను తీసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేస్తుంటుంది. వీటిలో తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆరియానా గ్లోరీ ఓ వీడియోను వదిలింది. ఇందులో తాను మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమాలో నటిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు, ఇందులో తాను హీరో చెల్లెలి పాత్రను పోషిస్తున్నానని, అది చాలా ప్రాధాన్యత ఉన్న రోల్ అని సీక్రెట్‌ను రివీల్ చేసింది. ఇంకా రహస్యాలు ఉన్నాయని వెల్లడించింది.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
     ఆరియానా గ్లోరీపై ఆ డైరెక్టర్ ప్రశంసల వర్షం

    ఆరియానా గ్లోరీపై ఆ డైరెక్టర్ ప్రశంసల వర్షం

    ఈ వీడియోలో ఆరియానాతో పాటు ఆ సినిమాను తెరకెక్కిస్తోన్న దర్శకుడు శ్రీధర్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా తనకు ఇలాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు అతడికి ధన్యవాదాలు తెలిపిందామె. ఇక, ఆ దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ.. 'నేను రాసిన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేస్తూ చక్కగా నటిస్తున్న ఆరియానాకు థ్యాంక్స్. నువ్వు త్వరలోనే హీరోయిన్ అవుతావు. మరీ ముఖ్యంగా ఆరి పాప అభిమానులకు కూడా స్పెషల్ థ్యాంక్స్. నేను సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చాడతను.

    English summary
    Bigg Boss Fame, TV anchor and Actor Ariyana Glory Very Active in Social Media. Recently She Shared Few Selfie Video in Instagram. She Revealed Big Secret in This Video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X