ఆరియానా గ్లోరీ సంచలన నిర్ణయం: ఇకపై అలాంటివే చేస్తానంటూ షాకిచ్చిన బ్యూటీ.. త్వరలోనే సర్‌ప్రైజ్!
యూట్యూబ్‌లో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ కాలంలోనే ఎవరూ ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అందులోనూ తనను తాను నిరూపించుకోవడంతో పాటు అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల మనసు దోచింది. ఫలితంగా విపరీతమైన ఫాలోయింగ్‌తో పాటు ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆరియానా గ్లోరీ సంచలన నిర్ణయం తీసుకుందట. ఆ వివరాలు మీకోసం!

ఆయన వల్లే పాపులరిటీ.. ఆఫర్ పట్టేసిందలా
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆరియానా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో పని చేసింది. తన కెరీర్‌లో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసిన ఆమె.. కొన్ని రోజుల క్రితం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో బోల్డుగా వ్యవహించడం.. ఆయన కూడా పచ్చి పచ్చిగా మాట్లాడడం వంటి వాటితో పాపులరై బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసింది.

భిన్నంగా ప్రవేశం... అక్కడి నుంచే రచ్చ స్టార్ట్
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపికైనా ఆరియానా గ్లోరీ.. అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి మిగిలిన హౌస్‌మేట్స్‌తో ఓ ఆట ఆడుకున్న ఆమె.. అల్లరి అల్లరి చేస్తూ తన హవా చూపించింది. రెండు రోజుల తర్వాత హౌస్‌లోకి వెళ్లి రచ్చ రచ్చ చేసింది. దీంతో కంటెస్టెంట్లందరికీ హెచ్చరికలు పంపింది.

దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధమయింది
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ ఎంత సరదాగా ఉండేదో.. టాస్కుల సమయంలో మాత్రం అంతే సీరియస్‌గా కనిపించేది. తాను గెలవడం కోసం ఎంతటి పనైనా చేసే ఆమె.. ఎన్నోసార్లు స్వార్ధంగా ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు, మరికొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఇలా పలు గొడవల్లో భాగమై వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

సాదాసీదాగా ఎంటర్... వచ్చేటప్పుడు మాత్రం
సాదాసీదా కంటెస్టెంట్‌గా ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. కానీ, ఊహించని రీతిలో ఆమె ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకుంది. అంతేకాదు.. ఏకంగా ఫినాలేలో అడుగు పెట్టింది. ఒకానొక దశలో ఆమెనే విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

ఆమెను బాగా వాడుతున్నారు.. తెగ హల్‌చల్
బిగ్ బాస్ షో తర్వాత ఆరియానా గ్లోరీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిన ఆమె.. వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్లతో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ప్రారంభించింది. అదే సమయంలో కొన్ని సినిమాలు, షోల ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇందులో భాగంగానే రాజ్ తరుణ్‌తో కలిసి నటిస్తోంది.
Recommended Video

ఇకపై అలాంటివే చేస్తానంటూ షాకిచ్చిన బ్యూటీ
ఆరియానా గ్లోరీ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. గతంలో మాదిరిగా యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా చేయకూడదనేదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, ఇప్పటికే కొన్ని యాంకరింగ్ ఆఫర్లను కూడా తిరస్కరించిందంట ఈ బ్యూటీ. దీనికి కారణం నటిగా స్థిరపడేందుకే అని తెలిసింది. ఇప్పటికే కొన్ని కథలను కూడా విన్నదని త్వరలోనే సినిమా ప్రకటన చేయనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











