ఆ కంటెస్టెంట్ కాళ్లు పట్టుకున్న ఆరియానా: నా పక్కన కూడా ఉందొద్దు అంటూ ఛీ కొట్టేసింది!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఫినాలేకు ఒక వారమే ఉండడంతో కంటెస్టెంట్లు అందరినీ నేరుగా నామినేట్ చేసేసిన షో నిర్వహకులు.. మిమ్మల్ని మీరు నిరూపించుకోమని వాళ్లకు సరికొత్త టాస్కులను ఇస్తున్నారు. దీంతో షోలో ఊహించని పరిణాలు ఎన్నో జరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని గొడవలు కూడా అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ.. మోనాల్ గజ్జర్ కాళ్లు పట్టుకుంది. అంతేకాదు, తనను వదిలేయమని దండం పెట్టి వేడుకుంది. ఆ వివరాలు మీకోసం!

అందరూ నామినేట్.. ఇలా ప్లాన్ చేశాడు
ఫినాలేకు ఒక వారం మాత్రమే సమయం ఉండడంతో అఖిల్ సార్థక్ (రేస్ టు ఫినాలే మెడల్ ద్వారా ఫైనల్‌కు చేరాడు) మినహా మిగిలిన ఐదుగురు సభ్యులను నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఫైనల్‌కు చేరాలంటే నలుగురికి మాత్రమే అవకాశం ఉండడంతో.. నామినేషన్‌లో ఉన్న వాళ్లకు సరికొత్త టాస్కులు ఇచ్చి ప్రేక్షకుల ముందు తమను తాము నిరూపించుకోమని చెప్పాడు.

మొదటిది ఆరియానా.. రెండోది సోహెల్
ఈ వారం టాస్కుల్లో భాగంగా మొదటి రౌండ్‌లో ‘కింగ్ ఆర్ క్వీన్' థీమ్ ఇచ్చారు. ఇందులో ఒకరి తర్వాత ఒకరు రాజు లేదా రాణిలా మారి తమ మార్క్ చూపించారు. ఇందులో ఆరియానా గెలుపొందింది. ఫలితంగా గోల్డ్ మైక్‌తో ప్రేక్షకులను నేరుగా ఓట్లు అడిగింది. ఆ తర్వాత రోబోలో కూర్చుని ఉండాలని పెట్టిన ‘ఓపిక' టాస్కులో సయ్యద్ సోహెల్ రియాన్ గెలుపొందాడు.

ఆరియానా - మోనాల్ మధ్య గొడవలు
మొదటి రౌండ్ ‘కింగ్ ఆర్ క్వీన్' కంటెస్టెంట్ల మధ్య అన్ని రకాల ఎమోషన్లను బయటకు తీసుకురాగా, ‘ఓపిక' టాస్క్ మాత్రం కొందరి మనసులో దాగున్న కుట్రలను బయట పెట్టింది. ఈ నేపథ్యంలోనే పలువురు కంటెస్టెంట్లు గొడవలకు దిగారు. మొదట మోనాల్ గజ్జర్, ఆరియానాను టార్గెట్ చేయగా, ఆ తర్వాత ఇది రివర్స్ అయింది. దీంతో ఈ పంచాయితీ బిగ్ బాస్ వరకూ వెళ్లింది.

సహనం కోల్పోయిన సోహెల్.. ఆమెపై
బుధవారం జరిగిన టాస్కులో సయ్యద్ సోహెల్ రియాన్ ఓపికకు పరీక్ష పెట్టారు. అప్పుడు ఆరియానా గ్లోరీ తన బొమ్మను, డ్రెస్‌ను ఎందుకు నీటిలో పడేశావ్ అంటూ అతడిని ప్రశ్నించింది. అంతేకాదు, ఈరోజు మొత్తం తేలిపోవాలి అంటూ సీరియస్ అయింది. దీంతో టాస్క్ పూర్తయిన వెంటనే సోహెల్ రెచ్చిపోయాడు. ఏకంగా ఆమె పైకి వెళ్తూ కొట్టినంత పని చేశాడు.

తలచుకుని తలచుకుని ఏడుస్తుండగా
అమ్మాయి అని కూడా చూడకుండా సోహెల్ మీదకి దూసుకు రావడం, నోరు పారేసుకోవడం వంటి వాటిని ఆరియానా గ్లోరీ జీర్ణించుకోలేకపోయింది. దీంతో పలుమార్లు ఆ గొడవను తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ సమయంలో ఆమెకు అండగా నిలిచాడు అభిజీత్. ‘నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌వి. అందుకే ఇన్ని వారాలు ఉన్నావు' అంటూ ఆరియానాకు ధైర్యం చెప్పాడు.
Recommended Video

మోనాల్ కాళ్లు పట్టుకున్న ఆరియానా
గార్డెన్ ఏరియాలో ఒంటరిగా కూర్చుని బాధ పడుతోన్న ఆరియానా దగ్గరకు మోనాల్ గజ్జర్ వెళ్లింది. ఆమెకు ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన ఆరియానా ‘మోనాల్.. దయ చేసి నన్ను ఒంటరిగా వదిలేయ్. నీ ముఖం చూడాలని కూడా నాకు అనిపించడం లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపో ప్లీజ్' అని అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే దగ్గరు కూర్చుండిపోయింది.


Click it and Unblock the Notifications











