For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. వాళ్ల ముందే అలా: భయానక ఘటనను బయటపెట్టిన ఆరియానా

  |

  ఆరియానా గ్లోరీ.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుందామె. ఆ సమయంలో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అక్కడ అసాధారణ పోరాటంతో అబ్బుర పరిచిన ఈ చిన్నది.. ఊహించని రీతిలో ప్రజాదరణను దక్కించుకుంది. షో తర్వాత ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోన్న ఆరియానా.. తాజా ఇంటర్వ్యూలో ఇటీవల జరిగిన ఓ భయానక సంఘటనను బయట పెట్టింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చింది.. అదరగొట్టేసింది

  సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చింది.. అదరగొట్టేసింది

  సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది యాంకర్ ఆరియానా గ్లోరీ. మొదటి ఎపిసోడ్‌లో సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్లిన ఆమె.. అక్కడి నుంచే కంటెస్టెంట్లను ఓ ఆట ఆడుకుంది. ఆ తర్వాత లోపలికి వచ్చి రచ్చ చేసింది. అప్పుడే ప్రేక్షకుల దృష్టిలో పడింది. అయినప్పటికీ ఈమె ఎన్నో రోజులు హౌస్‌లో ఉండదని అంతా అనుకున్నారు.

  బోల్డ్‌గా ఉంటానని చెప్పి.. డేర్‌గా ఆడింది

  బోల్డ్‌గా ఉంటానని చెప్పి.. డేర్‌గా ఆడింది

  నిజ జీవితంలోనూ బోల్డుగా ఉంటానంటూ పరిచయం చేసుకుని బిగ్ బాస్ షోలోకి ప్రవేశించిన ఆరియానా.. అందుకు తగ్గట్లుగానే వ్యవహరిస్తూ వచ్చింది. హౌస్‌లో నిజాయితీగా ఉంటూ.. ముక్కుసూటిగా మాట్లాడుతూ తరచూ అందరితో గొడవలకు దిగుతుండేది. అదే సమయంలో అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది. టాస్కుల కోసం ఎంతకైనా తెగిస్తూ సత్తా చాటి ఫినాలేకు చేరింది.

  ముక్కు అవినాష్ లవ్ ట్రాకుతో పాపులర్

  ముక్కు అవినాష్ లవ్ ట్రాకుతో పాపులర్

  బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా గ్లోరీ చాలా తక్కువ మందితో మాత్రమే సన్నిహితంగా ఉండేది. అందులో జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌తో మరింత చనువుగా వ్యవహరించేది. ఈ కారణంగానే వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే హౌస్‌లో వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండేవారు. కానీ, బయట మాత్రం ఫ్రెండ్ అని అంటున్నారు.

  హల్‌చల్ చేస్తున్న ఆరియానా.. వరుసగా

  హల్‌చల్ చేస్తున్న ఆరియానా.. వరుసగా

  ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలేలోకి అడుగు పెట్టింది ఆరియానా. కానీ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇక, షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా చాట్లతో తీరిక లేకుండా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆఫర్లు కూడా అందుకుంటోంది. ఇక, ఇటీవలే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది.

  అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు

  అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు

  సక్సెస్‌తో పాటు పాపులారిటీ విపరీతంగా రావడంతో ప్రస్తుతం దాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది ఆరియానా గ్లోరీ. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా తన నిజ జీవితంలో జరిగిన ఓ భయానక సంఘటనను బయట పెట్టింది. ‘ఒకసారి చార్మినార్ దగ్గరకు వెళితే.. ఒకడు నా నడుమును టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు' అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

  నా ఫ్రెండ్ ఉండబట్టే అక్కడితో ఆగిపోయింది

  నా ఫ్రెండ్ ఉండబట్టే అక్కడితో ఆగిపోయింది

  దీనిని కొనసాగిస్తూ.. ‘వాడు అక్కడ పట్టుకోగానే.. లాగి చెంపమీద ఒక దెబ్బ వేశాను. ఆ వెంటనే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాడిని గట్టిగా పట్టుకున్నారు. లేకుంటే తర్వాత ఏమయ్యేదో తలచుకుంటేనే భయంగా ఉంది. నేను కూడా కావాలని కొట్టలేదు. ఆ ఫ్లోలో అలా జరిగిపోయింది. ఆ సంఘటనను కొద్ది రోజులకే మర్చిపోయా. మళ్లీ ఇప్పుడు గుర్తొచ్చింది' అని ఆరియానా తెలిపింది.

  English summary
  Ariyana Gloryis a well-known South Indian TV anchor and actor. She started her career as an anchor at ‘Studio One’ in Hyderabad in 2015, and later, she started working at Sun TV Network Limited, Hyderabad as a TV anchor in 2016.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X