‘జానకి కలగనలేదు’ హీరో చనిపోయాడంటూ వార్త: అసలు మేటర్ రివీల్ చేస్తూ.. ఆరియానా సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని కొందరు మంచి పనులకు వాడుకుంటుంటే.. మరికొందరు మాత్రం తమ స్వార్థం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో అసత్యాలతో కూడిన ఎన్నో వీడియోలు దర్శనమిస్తుంటాయి. దీంతో అవే నిజాలు అనుకుని వీక్షకులు వాటిని చూస్తుంటారు.

ఇక, సెలెబ్రిటీల పర్సనల్ విషయాలపై ఎన్నో వీడియోలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే 'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్‌దీప్ చౌదరి చనిపోయినట్లు ఓ వీడియో వచ్చింది. దీనిపై బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

యాంకర్‌గా మొదలెట్టి.. అలా ఫేమస్

యాంకర్‌గా మొదలెట్టి.. అలా ఫేమస్

యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఫుల్ ఫేమస్ అయిపోయింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని కూడా అందుకుంది. ఇందులో అద్భుతంగా ఆడుతూ ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందింది. దీంతో ఫినాలేలో సైతం అడుగు పెట్టింది. చివర్లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

ఫేట్ మారిపోయింది.. బిజీ అయింది

ఫేట్ మారిపోయింది.. బిజీ అయింది

బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆరియానా గ్లోరీ ఫేట్ మారిపోయింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికే ఎన్నో షోలలో కనిపించిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటించేసింది. మరికొన్నింటికి సైతం సంతకాలు చేసేసింది. అంతేకాదు, బిగ్ బాస్ ఐదో సీజన్ బజ్ చాట్ షోకు కూడా హోస్టుగా చేస్తూ దూసుకుపోతోందీ బ్యూటీ.

అందులో ఫుల్ బిజీ.. అమర్ గురించి

అందులో ఫుల్ బిజీ.. అమర్ గురించి

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఆరియానా గ్లోరీ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన క్లోజ్ ఫ్రెండ్ 'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్‌దీప్ చౌదరి గురించి తరచూ పోస్టులు పెడుతూ ఉంటోంది.

Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!
https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-season-5-priyanka-singh-sensational-allegations-on-lobo-103008.html

అమర్‌దీప్ చనిపోయాడంటూ న్యూస్

అమర్‌దీప్ చనిపోయాడంటూ న్యూస్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన స్నేహితుడు అమర్‌దీప్ చౌదరి గురించి వచ్చిన ఓ న్యూస్ గురించి ప్రస్తావించింది. అసలు ఏమైందంటే.. అమర్ చనిపోయాడంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో ప్రత్యక్షం అయింది. దీనిపైనే ఆరియానా వీడియోలో స్పందించింది.

ఆ ఛానెళ్లపై ఫైర్ అయిన ఆరియానా

ఆ ఛానెళ్లపై ఫైర్ అయిన ఆరియానా

ఆ సెల్ఫీ వీడియోలో ఆరియానా గ్లోరీ మాట్లాడుతూ.. 'హలో ఎవ్రీవన్. నేను ఒక విషయం తెలియజేద్దామని అనుకుంటున్నాను. ఇందులో మీ సపోర్టు కూడా కావాలి. మేటర్ ఏంటంటే.. పది మందికి తెలిసిన పేరైతే పది మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. పోతేపోనీలో వ్యూస్ కోసమే.. సబ్‌స్క్రైబర్స్ కోసమో యూట్యూబ్ వాళ్లు ఇలా చేస్తారని అనుకోవచ్చు. మరీ ఘోరంగా బతికున్న మనిషి చనిపోయాడని థంబ్‌నెయిల్స్ పెట్టి.. ఏం చేస్తారండీ ఈ డబ్బులు? కడుపుకు పడుపుకు పడుతుందా? కామన్‌సెన్స్ ఉండాలి' అంటూ ఫైర్ అయింది.

అమర్ చనిపోయాడని అంటున్నారు

అమర్ చనిపోయాడని అంటున్నారు

ఈ వీడియోలో ఆరియానా గ్లోరీ కంటిన్యూ చేస్తూ.. 'నా ఫ్రెండ్ అమర్‌దీప్ చౌదరి (జానకి కలగనలేదు సీరియల్ హీరో) మీ అందరికీ తెలుసు కదా. వాడు చక్కగా సీరియళ్లు చేసుకుంటూ బిజీగా ఉంటే.. చనిపోయాడని థంబ్‌నెయిల్స్ పెట్టి.. మేటర్ ఇంకోటి పెట్టి ఏంటి మీకు? కామన్‌సెన్స్ ఉండాలి అసలు. ఇదెంత వరకూ రైట్ మీరే చెప్పండి' అంటూ భావోద్వేగంగా మాట్లాడింది.

Recommended Video

Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
చెత్త ఛానెల్ అంటూ పోస్టు పెట్టేసింది

చెత్త ఛానెల్ అంటూ పోస్టు పెట్టేసింది

సెల్ఫీ వీడియోలో సదరు ఛానెల్ పేరును కూడా వెల్లడించింది. 'ఆ ఛానెల్ పేరు *** అంట. మామూలుగా అయితే బూతులు వచ్చేవి నాకు. ప్లీజ్ ఫ్రెండ్ ఆ ఛానెల్ ఏదైతే ఉందో దాన్ని మీరు రిపోర్ట్ చేయండి. అన్‌సబ్‌స్క్రైబ్ కూడా చేయండి. ఏంటండీ ఈ ఫాల్త్ న్యూస్‌లు' అంటూ ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసింది. ఆ తర్వాత సదరు ఛానెల్ పెట్టిన వీడియో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X