నా టైమ్ బ్యాడ్.. అందుకే బీచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో అలా: అతడితో ఆరియానా గ్లోరీ వీడియో వైరల్

తెలుగులోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపును అందుకున్న షోలు చాలా అరుదు. అలాంటిది పరిచయం అయిన వెంటనే ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను పొంది నెంబర్ వన్ షోగా నిలిచింది బిగ్ బాస్. ఈ షో ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో నాలుగో సీజన్ కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీ ఒకరు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పర్సనాలిటీ అయిపోయింది. బిగ్ బాస్ ఫేమ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ బాయ్‌ఫ్రెండ్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైంది.. ఆయనతో ఫేమస్

అలా మొదలైంది.. ఆయనతో ఫేమస్

యూట్యూబ్‌లో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ కాలంలోనే ఎవరూ ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. చాలా తక్కువ సమయంలోనే ఎంతో మంది సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ఫుల్ పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన చిట్‌చాట్‌తో ఒక్కసారిగా సంచలనం అయిపోయిందామె.

అక్కడి నుంచి ఇక్కడికి.. క్రేజీగా ఎంట్రీ

అక్కడి నుంచి ఇక్కడికి.. క్రేజీగా ఎంట్రీ

వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది ఆరియానా గ్లోరీ. దీంతో ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ కూడా వచ్చింది. ఈ కారణంగానే ఆమెకు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో ఆ మధ్య జరిగిన నాలుగో సీజన్‌లో సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి ఆరియానా సీక్రెట్ రూమ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

చెప్పినట్లే చేసింది... వాళ్లను గెలిచింది

చెప్పినట్లే చేసింది... వాళ్లను గెలిచింది

తనను తాను బోల్డ్ అని చెప్పుకుంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది ఆరియానా గ్లోరీ. అందుకు అనుగుణంగానే షోలో రచ్చ రచ్చ చేసింది. బాస్ ఇచ్చే టాస్కులను తాను గెలవడం కోసం ఎంతటి పనైనా చేసే ఆమె.. ఎన్నోసార్లు స్వార్ధంగా ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు, మరికొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిందన్న అపవాదును మూటగట్టుకుంది.

అంచనాలు లేవు.. కానీ, అంత పేరుతో

అంచనాలు లేవు.. కానీ, అంత పేరుతో

ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకుంది. అంతేకాదు.. ఏకంగా ఫినాలేలో అడుగు పెట్టింది. మొత్తంగా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నా... రెమ్యూనరేషన్‌తో పాటు క్రేజ్‌నూ అందుకుంది. అలాగే, ఆఫర్లను రాబడుతూ సత్తా చాటుతోంది.

అతడితో ఆరియానా గ్లోరీ వీడియో వైరల్

అతడితో ఆరియానా గ్లోరీ వీడియో వైరల్

బిగ్ బాస్ షో వల్ల ఫుల్ హ్యాపీగా ఉంది ఆరియానా. దీంతో ఇది ముగిసిన తర్వాత ఆమె జోష్‌లో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అవినాష్, శ్రీముఖి, విష్ణుప్రియలతో కలిసి గోవా టూర్ వెళ్లింది. అక్కడ అమ్మడు యమ ఎంజాయ్ చేసింది. తాజాగా ఈ ట్రిప్‌కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆమె ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

అందుకే బీచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో అలా

అందుకే బీచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో అలా

ఈ టూర్‌లో భాగంగా 'ఇలాంటి ట్రిప్స్‌కి గర్ల్ ఫ్రెండ్‌తో రావాలని అనుకుంటాం.. కానీ ఫ్రెండ్‌ అయిన అరియానా వచ్చా' అని అన్నాడు అవినాష్. దీనికి ఆరియానా 'నా టైం బ్యాడ్. ఇక్కడకు బాయ్ ఫ్రెండ్‌తో రావాలి.. కానీ.. ఫ్రెండ్‌ అయిన అవినాష్‌తో వచ్చా' అని కౌంటర్ ఇచ్చింది. ఎంతో ఫన్నీగా సాగిన దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X