హాట్ ఫోజులతో షాకిచ్చిన ఆరియానా: స్విమ్మింగ్ పూల్ దగ్గర అలాంటి బట్టలతో రచ్చ చేసిన బ్యూటీ

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ షో. ఇక, దీని ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బోల్డ్ పాప ఆరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో భాగం అయిన ఈ భామ.. ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆరియానా హాట్ ఫోజులతో షాకిచ్చింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

ఆర్జీవీ చేసిన పనికి పాపులారిటీ

ఆర్జీవీ చేసిన పనికి పాపులారిటీ

యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులతో ఆమె ఇంటర్వ్యూలు నిర్వహించింది. అందులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన చిట్ చాట్ ఆమె జీవితాన్నే మార్చేసింది. దీనికి కారణం ఇది చాలా బోల్డుగా జరగడమే. అంతేకాదు, ఈ ఇంటర్వ్యూ తర్వాత వర్మ.. ఆరియానా గురించి ట్వీట్ చేశాడు.

బిగ్ బాస్ ఆఫర్.. సీక్రెట్‌గా ఎంట్రీ

బిగ్ బాస్ ఆఫర్.. సీక్రెట్‌గా ఎంట్రీ

రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌తో ఆరియానా గ్లోరీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో భాగంగానే గత ఏడాది జరిగిన సీజన్‌లోకి ఆమె సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ రూమ్ నుంచి కొన్ని రోజులు రచ్చ రచ్చ చేసింది. అలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి హైలైట్ అయిపోయింది.

 ఆటలో అదుర్స్.. చివరకు ఇలా

ఆటలో అదుర్స్.. చివరకు ఇలా

బిగ్ బాస్ షోలో మగ కంటెస్టెంట్‌లే ఎక్కువగా ఆడతారన్న టాక్ ఉండేది. అయితే, నాలుగో సీజన్ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మరీ ముఖ్యంగా ఇందులో ఆరియానా గ్లోరీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా ఫైటర్ అనే పేరు సంపాదించుకోవడంతో పాటు గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టింది. కానీ, నిరాశను మిగుల్చుతూ ఆమె నాలుగో స్థానానికి పరిమితం అయింది.

బిగ్ బాస్‌తో మారిపోయిన కెరీర్

బిగ్ బాస్‌తో మారిపోయిన కెరీర్

బిగ్ బాస్ షోలో అదరగొట్టడం వల్ల ఆరియానా గ్లోరీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక, షోలో ఉన్నందుకు గానూ పేరుతో పాటు రూ. 25 లక్షల వరకూ రెమ్యూనరేషన్ వచ్చింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్‌ను కూడా మొదలెట్టిందీ బ్యూటీ.

సినిమా ఛాన్స్‌లు.. అవి కంప్లీట్

సినిమా ఛాన్స్‌లు.. అవి కంప్లీట్

రియాలిటీ షో పుణ్యమా అని ఆరియానా గ్లోరీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు షోలు చేసిన ఆమె పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. ఆ వెంటనే మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు కంప్లీట్ చేసింది. ఈ క్రమంలోనే మరిన్ని ప్రాజెక్టులను చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

అందులో మాత్రం బిజీగా ఉంటూ

అందులో మాత్రం బిజీగా ఉంటూ

ఆరియానా గ్లోరీ ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. ఇక, బిగ్ బాస్ షో తర్వాత ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్2కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

స్మిమ్మింగ్ పూల్ దగ్గర ఘాటుగా

స్మిమ్మింగ్ పూల్ దగ్గర ఘాటుగా

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్ దగ్గర ఘాటు ఫోజులతో కనిపించింది. ఇక, ఇందులో ఆమె డ్రెస్ కూడా అందాలను కనువిందు చేసేలా ఉంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X