Bigg Boss Telugu 5 నుంచి లీకైన షాకింగ్ న్యూస్: ఈ సారి హోస్టుగా బోల్డు బ్యూటీ.. అతడు తప్పుకోవడంతో!
తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఇది ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అందుకే ఇప్పటికే ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో దానిని కూడా మొదలెట్టేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌కు మరో కొత్త హోస్టు రాబోతుందని తెలుస్తోంది. అది కూడా లేడీ సెలెబ్రిటీ అని అంటున్నారు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

ముగ్గురు స్టార్ హీరోలతో నాలు సీజన్లు
మిగిలిన భాషల కంటే తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ దీన్ని హోస్ట్ చేసిన హీరోలు కూడా ఈ సక్సెస్‌లో ప్రధాన పాత్రను పోషించారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, మూడు నాలుగు సీజన్లను నాగార్జున తమదైన శైలి అద్భుతమైన హోస్టింగ్‌తో సక్సెస్ చేశారనే చెప్పాలి.

మన షోకు జాతీయ స్థాయిలో గుర్తింపు
ఇండియాలో దాదాపు పది భాషల్లో బిగ్ బాస్ ప్రసారం అవుతోంది. అయితే, అన్ని చోట్ల కంటే తెలుగులో వచ్చే దానికే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇక్కడ ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా నాగార్జున హోస్టు చేసిన నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ దక్కింది. దీంతో టీఆర్పీలో నేషనల్ రికార్డులను బద్దలు కొట్టేసింది.

అనుమానాలకు బ్రేకిస్తూ... ఐదో సీజన్
ఈ రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏడాది ఇది ప్రసారం అవుతూనే ఉంది. దీంతో ఈ సారి కూడా ఇది ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా రెండో దశ కారణంగా ఈ సారి షో జరిగేది అనుమానమే అని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ షోకు సంబంధించిన పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు, దీన్ని సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది.

కంటెస్టెంట్ల ఎంపికపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే
కోవిడ్ కారణంగా ఐదో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా కొంత ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే దాదాపు వంద మంది జాబితా నుంచి షార్ట్ లిస్టును తయారు చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు హౌస్‌లోకి పంపించబోయే వాళ్ల కోసం జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారట నిర్వహకులు. త్వరలోనే కంటెస్టెంట్ల లిస్టును ఫైనల్ చేస్తారట.

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో లేడీ హోస్టుగా
బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేయడానికి 'బిగ్ బాస్ బజ్' పేరిట ఓ టాక్ షో రెండేళ్ల క్రితం మొదలైన విషయం తెలిసిందే. మూడో సీజన్‌కు తనీష్, నాలుగో దానికి రాహుల్ సిప్లీగంజ్ దీన్ని నడిపించారు. ఇప్పుడు ఐదో సీజన్‌కు మాత్రం లేడీ సెలెబ్రిటీ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆమె ఎవరో కాదు బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ.

అతడు తప్పుకోవడంతోనే ఈ నిర్ణయం
వాస్తవానికి బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించిన బజ్ షోకు సయ్యద్ సోహెల్ రియాన్ హోస్టుగా చేస్తాడని అన్నారు. అయితే, అతడి కమిట్‌మెంట్స్ కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడట. దీంతో ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడు తప్పుకోవడం వల్లే ఆరియానా గ్లోరీకి అవకాశం దక్కిందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందనే టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











