షాకింగ్ న్యూస్ చెప్పిన ఆరియానా గ్లోరీ: ఇకపై కనిపించను అని చెబుతూ సెల్ఫీ వీడియో.. ఒంటరిగానే అంటూ!

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అదిరిపోయే ఆటతో పాటు తన దూకూడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీ అయిపోయింది. దీంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది ఆరియానా. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన ప్రయాణం.. ట్వీట్‌తో పాపులర్

అలా మొదలైన ప్రయాణం.. ట్వీట్‌తో పాపులర్

సినిమా తారలను ఇంటర్వ్యూలు చేసేందుకు యూట్యూబ్‌లో యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రముఖులతో చిట్ చాట్ చేసింది. అలా.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె గురించి ఏకంగా ఆర్జీవీనే ట్వీట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది.

బిగ్ బాస్ అవకాశం.. సీక్రెట్‌గా వచ్చినా ఫోకస్

బిగ్ బాస్ అవకాశం.. సీక్రెట్‌గా వచ్చినా ఫోకస్

రాంగోపాల్ వర్మ ట్వీట్ల పుణ్యమా అని ఆరియానా గ్లోరీకి సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ వచ్చింది. దీంతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లే అవకాశాన్ని అందుకుంది. ఇందులో భాగంగానే ఆరంభ ఎపిసోడ్‌లో మిగిలిన కంటెస్టెంట్లలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచే తన మార్క్ చూపిస్తూ అందరి దృష్టిలో పడిపోయింది.

ఆటలో అదరగొట్టేసింది.. ఫినాలేలో ప్రతికూలం

ఆటలో అదరగొట్టేసింది.. ఫినాలేలో ప్రతికూలం

'నేను బోల్డ్ అమ్మాయిని. దేన్నైనా సాధించాలంటే వంద శాతం శ్రమిస్తా' అంటూ షోలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో చెప్పింది ఆరియానా. అందుకు అనుగుణంగానే టాస్కుల్లో గెలవడం కోసం ఎంతటి పనైనా చేసేది. ఇక అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకని ఫినాలేకు చేరింది. కానీ, చివర్లో ఊహించని విధంగా నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

బిగ్ బాస్ వల్ల బాగా ప్లస్... అలా లాభపడింది

బిగ్ బాస్ వల్ల బాగా ప్లస్... అలా లాభపడింది

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆరియానా గ్లోరీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక, షోలో ఉన్నందుకు గానూ పేరుతో పాటు రూ. 25 లక్షల వరకూ రెమ్యూనరేషన్ వచ్చింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది.

మెగా హీరోతో ఛాన్స్.. ఇప్పటికే రెండు చిత్రాలు

మెగా హీరోతో ఛాన్స్.. ఇప్పటికే రెండు చిత్రాలు

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలతో పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. దానికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ వెంటనే మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌ ఫోటోలను కూడా వదిలిందామె.

ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన ఆరియానా

ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన ఆరియానా

రియాలిటీ షో వల్ల ఆరియానా గ్లోరీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఆమె రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో కనిపించకపోయినా.. తెగ బాధ పడిపోతున్నారు ఆమె అభిమానులు. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలోనూ ఇదే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన ఫాలోవర్లకు, ఫ్యాన్స్‌కు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పిందీ బోల్డ్ బ్యూటీ.

 ఇకపై కనిపించను అని చెబుతూ సెల్ఫీ వీడియో

ఇకపై కనిపించను అని చెబుతూ సెల్ఫీ వీడియో

తాజాగా ఆరియానా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో వదిలింది. అందులో 'నేను రెండు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే తెగ ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చెబుతున్నా నేను 12 తేదీ వరకూ కనిపించను. హిమాలయాల్లో ట్రెకింగ్‌కు వెళ్తున్నా. ఒంటరిగానే ప్రయాణిస్తున్నా' అంటూ చెప్పింది. ఆ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫొటోనూ షేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X