టాలీవుడ్ యంగ్ హీరోతో ఆరియానా రచ్చ: త్వరలోనే భారీ సర్‌ప్రైజ్.. జీవితంలో మర్చిపోలేని రోజు అంటూ!
తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాధరణను అందుకుని, సక్సెస్‌ఫుల్‌గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ప్రతి సీజన్ నుంచి పలువురు కంటెస్టెంట్లు భారీ స్థాయిలో ఫాలోయింగ్ అందుకుని తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అవుతున్నారు. ఇలా ఇటీవల ముగిసిన నాలుగో సీజన్ నుంచీ కొందరు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న ఆమె.. షో తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యంగ్ హీరోతో కలిసి రచ్చ చేసింది. ఆ వివరాలు మీకోసం!

యాంకరింగ్ టు బిగ్ బాస్.. మధ్యలో ఆర్జీవీ
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ అలియాస్ అర్చన. ఈ క్రమంలనే ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లలో పని చేసిందామె. ఇందులో భాగంగానే ఎంతో మంది సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది. ఇలా ఓ సారి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. అప్పుడు ఆయనతో ఆరియానా వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయింది. దీంతో ఫుల్ పాపులరిటీ వచ్చింది.

వాళ్లలా కాకుండా సరికొత్తగా ఎంట్రీ ఇచ్చింది
రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఆరియానా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ నిర్వహకులు ఆమెకు నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. అలా షోకు ఎంపికైన ఈ బోల్డ్ బ్యూటీ.. అందరిలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి రెండు రోజులు రచ్చ చేసి ఆ తర్వాత హౌస్‌లోకి వెళ్లింది.
Recommended Video

టాస్కుల కోసం దేనికైనా రెడీ.. మంచి చెడు
బిగ్ బాస్ షోను ఆరియానా ఎంతో సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయం ఆమె ఆటతీరును బట్టే అర్థం చేసుకోవచ్చు. పెద్ద బాస్ ఇచ్చే టాస్కుల్లో గెలవడం కోసం ఎలాంటి పనులైన చేస్తుండేదామె. ఈ క్రమంలోనే ఫైటర్‌గా మంచి పేరును సంపాదించుకున్నప్పటికీ.. కొందరి విషయంలో క్రూరంగా వ్యవహరించిందని విమర్శలూ ఎదుర్కొంది. మొత్తంగా షోలో ఆమె బాగా హైలైట్ అయింది.

అలా వచ్చింది.. ఇలా ముగించిన ఆరియానా
మామూలు కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది ఆరియానా. ఎంతో మంది టైటిల్ ఫేవరెట్లు ఉన్నా.. అసాధారణ ఆటతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తద్వారా పలుమార్లు నామినేషన్స్‌ను తప్పించుకోవడంతో పాటు గ్రాండ్ ఫినాలేలో అడుగు పెట్టింది. తుది పోరులో మాత్రం అభిజీత్ ఫాలోయింగ్ ముందు నిలవలేకపోయిన ఆరియానా నాలుగో స్థానంలో నిలిచింది.

ఫుల్ బిజీగా మారింది.. సర్‌ప్రైజ్ వస్తుందని
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ ఫుల్ బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా చాట్లతో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ప్రారంభించింది. అదే సమయంలో కొన్ని సినిమాలు, షోల ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది.

టాలీవుడ్ యంగ్ హీరోతో ఆరియానా రచ్చ
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో కలిసి ఓ ఫొటోను దిగిన ఆరియానా, దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో 'త్వరలోనే ఓ సర్‌ప్రైజ్ రాబోతుంది. బిగ్ బాస్ తర్వాత నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. నాకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గవిరెడ్డి శ్రీను గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ నువ్వు అద్భుతం' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ సర్‌ప్రైజ్‌పై ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











