ఏకంగా ఎంగేజ్మెంట్ రింగ్ తెచ్చేసిన బోల్డ్ పాప.. అవినాష్ అరియానాల నిశ్చితార్థం!

బుల్లితెరపై ప్రేమ జంటలను తీసుకోరావడం, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీని బయట పెట్టి షోలను సక్సెస్ చేసుకుంటున్నారు. ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ షోలు అన్నీ కూడా ఇలానే ఉంటున్నాయి. మొన్నటికి మొన్న 100 పర్సెంట్ లవ్ అంటూ రీల్ జంటలు, రియల్ జంటలకు మధ్య పోటీలు పెట్టి ఓ ఈవెంట్ చేశారు. అందులో ఏకంగా ఓ జంటకు నిశ్చితార్థం జరిపించేశారు. కొన్ని జంటల మధ్య ఉన్న వ్యవహారాలపై క్లారిటీ వచ్చేలా చేశారు.

అవినాష్ అరియానాలు అలా..

అవినాష్ అరియానాలు అలా..

అవినాష్ అరియానాలు బిగ్ బాస్ షోలో చేసిన రచ్చను ఎవ్వరూ మరిచిపోలేదు. బిగ్ బాస్ టీం కూడా ఈ జంటపై బాగానే ఫోకస్ పెట్టింది. ఈ ఇద్దరి ట్రాక్‌ను జనాల్లోకి బాగానే తీసుకెళ్లారు. అలా ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు ఆ క్రేజ్‌ను వాడేసుకుంటున్నారు.

స్పెషల్ ఈవెంట్‌,షోలు..

స్పెషల్ ఈవెంట్‌,షోలు..

ఇప్పుడు బుల్లితెరపై అవినాష్ అరియానాల కెమిస్ట్రీ హైలెట్ అవుతోంది. బయటకు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా.. తెర మీదకు వచ్చే సరికి మాత్రం ఓ రేంజ్‌లో కెమిస్ట్రీని పండిస్తుంటారు. ప్రేమ జంటలా నటిస్తుంటారు. అది నటనో నిజమో తెలియనంతగా జీవించేస్తుంటారు.

తాజాగా అలా..

తాజాగా అలా..

100 పర్సెంట్ లవ్ షోలోనూ ఇద్దరూ అలానే చేశారు. ఆ ఇద్దరి రొమాంటిక్ పర్ఫామెన్స్ చూసిన అందరూ షాక్ అయ్యారు. నిజంగా చేస్తున్నారా? ఏది నిజం ఏది అబద్దమో పోల్చుకోలేకపోతోన్నామని యాంకర్ రవి స్టేజ్ మీదే అసలు విషయం అడిగేశాడు. త్వరలోనే చెబుతాను అంటూ అరియానా కూడా ఓ హింట్ ఇచ్చేసింది.

ఆ షోలో ఇలా..

ఆ షోలో ఇలా..

అయితే సుమ నిర్వహిస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోలో అవినాష్ అరియానాలు గెస్ట్‌లుగా వచ్చారు. అలా ఊరికే వస్తే ఆ షోకు ఎలా హైప్ వస్తే ఏం ఉంటుందని అనుకున్నారో ఏమో గానీ. ఓ స్క్రిప్ట్ రెడీ చేసేశారు. అరియానానే అవినాష్‌కు ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఓ ప్రోమోను వదిలారు.

ఎంగేజ్మెంట్ రింగ్..

ఎంగేజ్మెంట్ రింగ్..

ఈ సమయంలో ఒకటి బయటకు చెప్పాలని అనుకుంటున్నాను అంటూ రింగ్ పట్టుకొచ్చింది అరియానా. అవినాష్ ముందు మోకాళ్ల మీద నిల్చుని ప్రపోజ్ చేసినట్టుంది. అయితే ప్రోమో చూస్తుంటే అక్కడే ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు కనిపిస్తోంది. కానీ షోలో అసలు సంగతి బయట పడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X