మూడు నెలలు నీతోనే ఉన్నా.. రెండు పూటలు అలా.. అవినాష్‌పై అరియానా కామెంట్స్
బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ ఎంత బాగా వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో బయట వారికి పెరిగిన క్రేజ్ గురించి తెలియదు. అయితే ఒక్కసారి బయటకు వచ్చాకు వారి ఇమేజ్, వారి కెమిస్ట్రీ గురించి తెలుసుకున్నాక షాక్ అయ్యారు. అందుకే అలా ఆ కెమిస్ట్రీ ఇంకా ముదిరిపోయేలా చేస్తూ ఇతర షోల్లో అరియానా అవినాష్‌లు రెచ్చిపోతోన్నారు.

అవినాష్ అలా..
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో అవినాష్ అందరితోనూ పులిహోర కలిపాడు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. మోనాల్, దివి, సుజాత, అరియానా ఇలా ఇంట్లో ఉన్న అమ్మాయిలతో పులిహోర కలుపుతో కాలాన్ని గడిపాడు. అయితే చివరకు మాత్రం అరియానాకు ఫిక్స్ అయ్యాడు.
విందులో మునిగి తేలిన షారుక్ కూతురు.. స్నేహితులతో కలిసి పార్టీలో సుహానా ఖాన్ రచ్చ

క్రేజీ కాంబో..
ఇక అరియానా అవినాష్ జంటకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మొదట్లో ఇద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు అరియానా తన ప్రేమ గురించి అసలు విషయంచెప్పింది. తాను ఆల్రెడీ ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే అప్పటి నుంచి అరియానా అవినాష్‌లను ఫ్రెండ్స్‌లానే చూస్తు వచ్చారు.

కొత్త షోలో అలా..
అవినాష్ స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే కొత్త షోతో ప్రయోగం చేశాడు. అది బాగానే క్లిక్ అయింది కూడా. అలా ఈ షోకు తన స్నేహితురాలైన అరియానాను బాగానే ఉపయోగించుకున్నాడు. ఆమెతో ఉన్న కెమిస్ట్రీని మరింతగా ముందుకు తీసుకెళ్తూ స్కిట్లు వేస్తూ వచ్చాడు.

ప్రస్తుతం సుమ షోలో..
ఇలా బుల్లితెరపై ఇప్పుడు ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. అందుకే సుమ హోస్ట్ చేస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోలోనూ అరియానా అవినాష్‌లు సందడి చేశారు. అరియానా, అవినాష్ సుజాతలు ఓ టీం.. అమ్మ రాజశేఖర్, దివి, కరాటే కళ్యాణిలు మరో టీంగా సుమ సెట్ చేసింది.

మూడు నెలలు నీతోనే..
మూడు నెలలు నీతేనే ఉన్నాను అంటూ అరియానా అనడం.. మూడు నెలలు నాతోనా? అంటూ అవినాష్ ద్వంద్వార్థం వచ్చేలా మళ్లీ ఒత్తి పలకడం రచ్చగా మారింది. మూడు పూటల్లో రెండు పూటలు తినిపించావ్ అంటూ అరియానా అనడం.. పక్కనుంచి సుజాత అందుకుని నాక్కూడా తినిపించావ్ కదా అని సెటైర్ వేయడంతో అవినాష్ గాలి పోయింది.

రింగ్ పట్టుకుని..
పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబు అనే పాటకు అవినాష్ బాధపడుతుంటే.. ఈ సమయంలో ఒకటి బయటకు చెప్పాలని అనుకుంటున్నాను అంటూ రింగ్ పట్టుకొచ్చింది అరియానా. అవినాష్ ముందు మోకాళ్ల మీద నిల్చుని ప్రపోజ్ చేసినట్టుంది. మరి దీని వెనుకున్న అసలు కథ ఆదివారం బయట పడనుంది.


Click it and Unblock the Notifications











