ఓంకార్ అన్నయ్య కాస్తా బావ అయ్యాడు.. అరియానా దెబ్బకు అవినాష్ ఖతం
ప్రస్తుతం బుల్లితెరపై ట్రాకులు ఎంతగా ఫేమస్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. అది బిగ్ బాస్ షో అయినా జబర్దస్త్ షో అయినా సరే. అందులో కచ్చితంగా ప్రేమ వ్యవహారాలు, పులిహోర బ్యాచ్‌లు, ట్రాకులు ఉండాల్సింది. ఈ మధ్య ఏ షోను తీసుకున్నా కూడా ఇవే కనిపిస్తుంటాయి. దీనికి ఓంకార్ కూడా అతీతుడేమీ కాదు. మామూలుగా అయితే బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోల్లో ఎమోషన్ పండించడంలో ఓంకార్ తరువాతే ఎవరైనా. కానీ అలాంటి ఓంకార్ కూడా పులిహోర, పిచ్చి ట్రాకులను ఎంకరేజ్ చేయక తప్పడం లేదు.

డ్యాన్స్ ప్లస్‌లో..
ఓంకార్ ఇప్పుడు స్టార్ మాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ స్లాట్స్ అన్నీ కూడా ఓంకార్ అధీనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఓంకార్ డ్యాన్స్ ప్లస్, కామెడీ స్టార్స్ షోలను పైకి లేపే పనిలో పడ్డాడు. ఇప్పుడిప్పుడే డ్యాన్స్ ప్లస్ గాడిలో పడుతోంది. గత వారమే టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోయింది.

సెలెబ్రిటీలతో స్పెషల్..
గతవారాల్లో డ్యాన్స్ ప్లస్ షోలో సెలెబ్రిటీలను తీసుకొచ్చి కంటెస్టెంట్లకు తోడుగా పర్ఫామెన్స్‌లు చేయించాడు. హారిక, మెహబూబ్, విష్ణుప్రియ, ఐశ్వర్యా ఇలా సెలెబ్రిటీలను తీసుకొచ్చి చేసిన ప్రయత్నం మూలంగా మంచి రేటింగ్సే వచ్చాయి. అయితే ఈ వారం ఓంకార్ మరో ప్లాన్ వేశాడు.

ఓంకార్ అన్నయ్య..
వాలెంటైన్స్ డేగా రాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో అరియానా అవినాష్‌లను తీసుకొచ్చాడు. అయితే ఈ ట్రాక్‌పై జనాల్లో ఉన్న బజ్ గురించి ఓంకార్‌కు తెలిసిందే. అందుకే ఇలా ఆ ఇద్దరి మధ్య పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు. మామూలుగానే అందరూ ఓంకార్ అన్నయ్య అంటూ సంబోధిస్తుంటారు.

అరియానా కూడా..
అయితే అవినాష్ అన్నయ్య అంటూ సంభోదించాడు. పెళ్లి గురించి అరియానాను అడగడంతో.. ఆమె కూడా అన్నయ్య అనేసింది. నేనూ అన్నయ్య అని పిలిచి నువ్వు కూడా అన్నయ్య అని పిలిస్తే ఎలా? అని అవినాష్ ఫైర్ అయ్యాడు. సరే అంటూ ఓంకార్‌ను బావా అని ప్రేమగా పిలిచింది అరియానా.

దెబ్బకు ఖతం..
అలా అరియానా బావా అని ఓంకార్‌ను పిలవడంతో అవినాష్ పని ఖతమైనట్టుంది. దెబ్బకు ఎక్కడో మండిపోయి.. పిలిస్తే నన్నే అలా పిలవాలి అంటూ అరియానాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఓంకార్ లాంటి బావ ఉండాలంటూ అరియానా కూడా కామెడీ చేసింది. మొత్తానికి ఓంకార్ అన్నయ్యను బావగా చేసేశారు.


Click it and Unblock the Notifications











