Bigg Boss Telugu 7: శివాజీకి బిగ్ షాక్... దారుణంగా వెన్నుపోటు పొడిచిన ఆ కంటెస్టెంట్!
బిగ్ బాస్ తెలుగు 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతుంది. ఇక 13వ వారం నామినేషన్స్ సైతం హాట్ హాట్ గా సాగాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో 7 మంది ఉన్నారు. ఒక్క అమర్ దీప్ తప్ప.. ఇంట్లోని సభ్యులంతా నామినేట్ అయిపోయారు. అయితే ఈ క్రమంలో శివాజీకి ఊహించని బిగ్ షాక్ తగిలింది. నమ్మిన ఓ కంటెస్టెంట్ వెన్నుపోటు పొడిచాడు. ఈ విషయం ప్రశాంత్ తో డిస్కర్షన్ పెట్టిన శివాజీ... ఆ కంటెస్టెంట్ గురించి ప్రశాంత్ సైతం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అసలు ఎవరు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మరో మూడు వారాల్లో సమాప్తం కానుంది. గ్రాండ్ ఫినాలేకి దగ్గర పడుతుండటంతో.. అందరూ కసితో ఆడుతున్నారు. ఇక 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలు అయింది. ఇక నామినేషన్స్ లో శివాజీ, ప్రశాంత్, యావర్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఇక ఈ వారం అమర్ దీప్ నామినేషన్స్ లో లేడు. ఈ వారం అతడు సేఫ్ అయిపోయాడు.

ఇదిలా ఉంటే కెప్టెన్సీ టాస్కులో ఎంత రచ్చ అయిందో అందరికీ తెలిసిందే. అమర్ కోసం స్టాండ్ తీసుకుని శోభా శెట్టి నిలబడింది.. ఇక అర్జున్ అంబటి కోసం.. శివాజీ నిలబడ్డాడు. ఇక శివాజీ.. అమర్ ను ఓడించేందుకు.. అర్జున్ వైఫ్ నా దగ్గర మాట తీసుకుంది.. నేను కెప్టెన్సీ టాస్కులో అర్జున్ ను గెలిపించాలి అంటూ ఓ స్ట్రాటజీ చూపించాడు. ఇక చివరకు కెప్టెన్సీ టాస్కునే బిగ్ బాస్ రద్దు చేశాడు. అంత పెద్ద గొడవ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఈ విషయంపై అమర్, అర్జున్ కూడా మాట్లాడుకున్నారు. వదినా శివాజీ అన్న దగ్గర మాట తీసుకుందా అని అడిగాడు అమర్. లేదు.. అసలు ఆయన దగ్గర ఎందుకు తీసుకుంటుందని అర్జున్ అమర్ తో చెప్పాడు. ఇక ఆ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక అమర్ దీప్ ను కెప్టెన్ కాకుండా చేసేందుకు శివాజీ స్ట్రాటజీ అలా ఉందన్నమాట. ఇదిలా ఉంటే.. శివాజీకి నామినేషన్స్ లో పెద్ద షాక్ పడింది.
అర్జున్ కోసం అంత స్టాండ్ తీసుకున్న శివాజీని.. అర్జునే నామినేట్ చేసాడు. దానికి కారణం కెప్టెన్సీ టాస్కు. ఈ జలక్ ను శివాజీ అస్సలు ఊహించలేదు. ఈ విషయాన్ని బాధపడుతూ.. అర్దరాత్రి ప్రశాంత్ కు చెప్పుకున్నాడు శివాజీ. ప్రశాంత్ సైతం.. ఈ విషయం నాకు ముందే తెలుసు.. అర్జున్ కరెక్ట్ కాదనే విషయం తెలుసన్న అంటూ ప్రశాంత్ చెప్పుకువచ్చాడు. ఇలా అర్జున్ ఇచ్చిన జలక్ ను శివాజీ తీసుకోలేకపోయాడు తొలిసారి.

ఇక అర్జున్ విషయానికి వస్తే.. ఐదో వారంలో హౌస్ లోకి అడుగుపెట్టాడు. రావడం రావడమే.. అమర్ ను నామినేట్ చేసి.. అసలు విషం చెప్పాడు. ఇక తను అవసరం తీరుగా గోడ మీద పిల్లిలా ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటాడని ప్రేక్షకులకు కూడా అర్థం అయింది. ఇక ప్రెండ్ షిప్ బ్యాండ్ కడుతూ.. శత్రువును పక్కన ఉంచుకోవాలి అని చెప్పినప్పుడే.. శివాజీకి అర్థం కావాల్సింది. మొదటిసారి అర్జున్ చేతిలో దెబ్బతిడనంతో.. శివాజీ బాధపడటం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











