Bigg Boss Telugu Finale: అర్జున్ అంబటి ఎలిమినేట్.. 10 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డు పడనుంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ సీజన్... డిసెంబర్ 17కి ముగియనుంది. ఇక ఇది సీజన్ 7 కాబట్టి గ్రాండ్ ఫినాలేకు ఏడుగురిని తీసుకెళ్తారనుకున్నారని మొదటి నుంచి అంతా అనుకున్నారు. కానీ టాప్ 5ని కాకుండా ఆరుగురు కంటెస్టెంట్స్ ను ఫైనల్స్ కు పంపించారు. వీరిలో అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్‌దీప్ ఉన్న సంగతి తెలిసిందే.
నిజానికి ఈ ఆరుగురిలో అర్జున్ రెండు వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సి ఉండగా... తను ఫినాలే అస్త్ర పొందడంతో ఈ సీజన్‌లోనే తొలి ఫైనలిస్టుగా నిలిచాడు. దీంతో ఆ వారం ఓట్లు పడకపోయినా నేరుగా ఫినాలే వీక్‌లో ఎంటర్ అయ్యాడు అర్జున్. ఇకపోతే రేపటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం నుంచి షూటింగ్ జరగ్గా.. 8.30కి క్లోజ్ అయింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ఆటపాటలు షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

అయితే టాప్ 6లో అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. గతంలోనూ అతడికి తక్కువ ఓట్లు రావడంతో ఈసారి కూడా ఓటింగ్‌లో అర్జున్ చివరి స్థానంలో ఉన్నారని సమాచారం. అందువల్లే ఆయన టాప్ 6లో డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యాడని సమాచారం. ఇక అర్జున్ విషయానికి వస్తే వైల్డ్ కార్డు ద్వారా ఐదో వారంలో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు. బయట గేమ్ చూసి.. పకడ్బందీగా వచ్చాడు. కన్ఫీడెంట్ గా సింగిల్ గేమ్ ఆడి ఫినాలే వరకు రాగలిగాడు.
కానీ ప్రేక్షకాదరణ పొందడంలో మాత్రం అర్జున్ ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి. సీజన్ ప్రారంభమైనప్పుడే అర్జున్ హౌస్‌లో అడుగుపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. టాస్కులు ఇరగదీస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే అర్జున్ ఈరోజు విన్నర్ రేసులో నిలబడేవాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో రేసులోనే లేకుండా పోయాడని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
అయితే విన్నర్ కాకపోయినప్పటికీ ఆయన విన్నర్ కు వచ్చే ప్రైజ్ మనీకి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. వారానికి అర్జున్ అంబటి రూ.4.50లక్షలు తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ లెక్కన సీజన్ మొత్తం మీద అర్జున్ 10వారాలకు 45లక్షల రూపాయలు వెనకేసుకున్నాడు. ఇక మరోవైపు సినిమా ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కున్న చిత్రంలో అర్జున్ కు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











