Bigg Boss Telugu 7: షోలో ఒకే ఒక్కడు.. అతడి జర్నీ వీడియోతో ఎడిపించేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ తెలుగు 7 మరో 5 రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇక చివరి ఘట్టానికి చేరుకున్న ఈ షో.. మరింత ఆసక్తిగా సాగుతోంది. తాజాగా హౌస్ లోని కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్ అంటే శాసించడం, నవ్వించడం.. గేమ్స్ పెట్టడం చూశాం... కానీ మొదటి సారి జర్నీ వీడియో చూపించి.. ప్రేక్షకులను సైతం ఏడిపించేశాడు. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 షోలో ప్రస్తుతం ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. వీరు అందరూ ఫైనలిస్టులు కాగా... ఒక్కక్కొరి జర్నీ వీడియోను బిగ్ బాస్ రిలీజ్ చేస్తున్నాడు. ఇక నిన్న అర్జున్ అంబటిని గార్డెన్ ఏరియాకు పిలిచి బిగ్ బాస్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలోకి వెళ్లిన అర్జున్... ఏంట్రి సాంగ్ ఆరడుగుల బుల్లెట్ అంటూ ప్లే చేసి జోష్ పెంచాడు. ఆ తర్వాత ఆ సెటప్, తన జర్నీ ఫోటోలు చూసి అర్జున్ తెగ సంబురపడిపోయాడు.

Arjun Ambati Emotional Bigg Boss Telugu 7 Journey Video Full Details Here

ఇక బుక్ ఆఫ్ మెమోరీస్ అల్బమ్ ఓపెన్ చేయగా.. అందులో తన భార్య సురేఖ అర్జున్ ఫోటోలు ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ లో అర్జున్ భార్య... బిగ్ బాస్ షోలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఫోటోలను చూసి.. అర్జున్ ఎమోషనల్ అవుతూ... పప్పీ ఫోటోస్ చూడు భలే ఉన్నాయ్ అంటూ చెప్పుకువచ్చాడు. ఆ ఫోటోస్ చూసి బిగ్ బాస్ కు అర్జున్ థ్యాంక్స్ చెప్పాడు. ఇక గిన్నెలో ఉల్లిపాయలు చూసి... తన టాస్కు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు అర్జున్.

ఇక ఈ పది వారాలు నా లైఫ్ లో ఎప్పుడూ మరిచిపోలేని జర్నీ బిగ్ బాస్ అని అర్జున్ చెప్పుకు వచ్చాడు. థ్యాంక్యూ సోమచ్ అంటూ బిగ్ బాస్ కు చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్.. అర్జున్ ను యాక్టివిటీ ఏరియాకు పిలిచాడు. అర్జున్ జర్నీ వీడియో ప్లే చేసే ముందు ఎలివేషన్ ఇస్తూ బిగ్ బాస్ అర్జున్ గురించి చెప్పుకువచ్చాడు. అర్జున్.. కదిలే బండిలోకి ఎక్కడం సాహసంతో కూడిన చర్య.. అది అంతే ప్రమాదం కూడా.. కానీ ఆరోవారంలో ఇంట్లో అడుగుపెట్టగానే ఆ ప్రమాదం మీ రూపంలో తోటి ఇంటి సభ్యులకి కనిపించిందంటూ కేజీఎఫ్ లెవెల్ లో ఎలివేషన్ ఇచ్చాడు బిగ్ బాస్.

మీ కుటుంబానికి మీ తోడు అవసరమని తెలిసినా... మీ లక్ష్యం చేరాలనే పట్టుదల మీ ఆట గురించి ఆలోచించేలా చేసింది. ఎందుకంటే ఆ కల మీ ఒక్కరిదే కాదు మీలో సగమైన మీ భార్యది కూడా.. మీరు ఎవరివైపు ఉన్నారో తెలీక అందరూ ఆలోచనలో పడ్డ సమయంలో మీ పూర్తి ఏకాగ్రత ఆటపై ఉంచి సీజన్ -7 యొక్క మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచారు. అర్జున్.. ఎప్పుడొచ్చామని కాదు ఆట పూర్తయ్యే సమయానికి ఎక్కడ నిలిచామనేది ముఖ్యం అంటూ బిగ్ బాస్ చెప్పుకువచ్చాడు.

ఇక అర్జున్ జర్నీ ఓసారి చూసుకుంటే.. వైల్డ్ కార్డు ఎంట్రీ నుంచి... ఫినాలే అస్త్రం గెలిచేవరకు అద్భుతంగా ఎడిట్ చేసి వీడియోను వదిలారు. దానికి తోడు అర్జున్ జర్నీ వీడియోకు బహుబలి మ్యూజిక్ వేసి... ఎలివేషన్ ఇచ్చారు. ఓ వైపు ఫన్, ఎమోషన్, బాండింగ్ అన్ని కలగలపి వదిలారు. ఇక ఆ వీడియో చూస్తే.. ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయిపోవాల్సిందే. ఇక ఆ వీడియో తర్వాత అర్జున్ మాట్లాడుతూ... ఒక్కడినే ఉన్నా.. నా కోసమే ఆడాను.. ఒక్కడినే ఇక్కడి వరకూ వచ్చాను.. మీరు ఇచ్చిన మెమొరీస్ ఎప్పటికీ మర్చిపోలేను బిగ్‌బాస్.. నిజంగా ఈ జర్నీ మెమొరీస్‌కి రుణపడి ఉంటాను.. థాంక్యూ సో మచ్.. అంటూ అర్జున్వ వెళ్లిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X