Bigg Boss Telugu 7: టికెట్ టు ఫినాలే టాస్క్... టాప్‌లో డేంజర్ జోన్ కంటెస్టెంట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది. ఇక ప్రస్తుతం హౌస్ లో 8మంది ఉన్నారు. వీరిలో ఫస్ట్ టికెట్ టు ఫినాలే ఎవరు గెలుచుకుంటారు అనేది ఆసక్తి కలిగిస్తుంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో.. ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. అందులో హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా పోటా పోటీగా పాల్గొంటున్నారు. అయితే ఈ టికెట్ టు ఫినాలే టాస్కులో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్.. టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత సీజన్స్ కంటే ఆసక్తిగా సాగుతోంది. ఈసారి ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ షో... చివరి అంకానికి చేరుకుంది. ఇక హౌస్ లో ఉన్నది 8 మంది కంటెస్టెంట్స్. వారిలో ఈ వారం 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం అమర్ దీప్ చౌదరి తప్ప... శివాజీ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Arjun Ambati in danger zone and Top in Ticket to Finale Task in Bigg Boss Telugu 7 Full Details Here

ఇక ఈ వారం టాప్ ఓటింగ్ లో ప్రశాంత్, శివాజీ ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో యావర్, ప్రియాంక, శోభా శెట్టి ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో మాత్రం గౌతమ్, అర్జున్ అంబటి ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఎలాగూ ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉండాలి... సో ఈ వారం మేల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ఎక్కువగా ఈ వారం అర్జున్ అంబటి ఎలిమినేట్ కానున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే టాస్కులో ముందంజలో ఉన్నారు. టికెట్ టు ఫినాలే టాస్కులు 7 పెట్టనున్నారు. ఈ ఏడింటిలో ఎక్కువగా ఎవరు పాయింట్స్ సాధిస్తారో వాళ్లు డైరెక్టుగా ఫినాలికే వెళ్తారు. అయితే డేంజర్ జోన్ లో ఉన్న అర్జున్ అంబటి.. ఎక్కువ పాయింట్స్ తో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు హౌస్ లో మూడు టికెట్ టు ఫినాలే టాస్కులు పెట్టారు. అందులో ఎక్కువ పాయింట్స్ సాధించారు అర్జున్.

Arjun Ambati in danger zone and Top in Ticket to Finale Task in Bigg Boss Telugu 7 Full Details Here

టికెట్ టు ఫినాలే టాస్కుల్లో మొదటి టాస్కులో అర్జున్ గెలవగా.. మళ్లీ రెండో టాస్కులో ప్రశాంత్ గెలిచాడు. ఇక మూడో టాస్కులోనూ అర్జున్ అంబటి నిలిచాడు. దీంతో టాప్ లోకి వచ్చేశాడు అర్జున్. ఒకసారి స్కోర్ బోర్డ్ పరిశీలిస్తే.. అర్జున్ అంబటికి 200 ప్లస్ పాయింట్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాతి స్థానంలో అమర్ దీప్ 150 ప్లస్ పాయింట్స్ తో నిలిచాడు. అయితే అమర్ దీప్ కాకుండా ప్రశాంత్ ఉండాల్సింది కానీ.. అమర్ రెండో స్థానానికి రావడానికి కారణం శోభా శెట్టి, శివాజీ.

వీరు కెప్టెన్సీ టాస్కు నుంచి ఔట్ కావడంతో వారికి వచ్చిన పాయింట్స్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి. వీళ్లు అమర్ దీప్ కు ఇవ్వడంతో.. అమర్ పాయింట్స్ పెరిగాయి. ఇక మూడో స్థానంలో ప్రశాంత్ నిలిచాడు. ప్రశాంత్ కు 120 ప్లస్ పాయింట్స్, ఆ తర్వాతి స్థానంలో యావర్ 100 ప్లస్ పాయింట్స్, ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక, గౌతమ్ వంద ప్లస్ పాయింట్స్ తో నిలిచారు. ఇక ఈ మూడు టాస్కుల్లో అర్జున్ ఉండటంతో.. అటు డేంజర్ జోన్ లోనూ ఉన్న అర్జున్.. ఇటు టికెట్ టు ఫినాలేలో టాప్ ఉన్నాడు. ఏం జరగనుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X