Bigg Boss Telugu 7: విన్నర్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న అర్జున్ అంబటి.. అలా చేయకపోయి ఉంటే..!
బిగ్ బాస్ తెలుగు 7 మరో వారం రోజుల్లో ముగియనుంది. అయితే ఈ షో విజేత ఎవరు కానున్నారు అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఇప్పటికే ఫస్ట్ ఫైనాలిస్టుగా ఎంపిక అయిన అర్జున్ అంబటి.. నిజానికి విన్నర్ కావాల్సిన పర్సన్. అయితే ఆయన విన్నర్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. ఆ ఒక్క మిస్టేక్ వల్లే ఆయన విన్నర్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్జున్ అంబటి చేసిన మిస్టేక్స్ ఏంటి.. ఎందుకు విన్నర్ ఛాన్స్ మిస్ చేసుకున్నడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 మరో వారం రోజుల్లో ముగియనుంది. డిసెంబర్ 17న ఈ షో గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. ఇక ఈ షోలో మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలా వైల్డ్ కార్డు ద్వారా అర్జున్ అంబటి ఎంటర్ అయి.. ఫస్ట్ ఫైనాలిస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ అంబటి.. ఈ సీజన్ విన్నర్ అయ్యే కెపాసిటీ గల వ్యక్తి. అయినప్పటికీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

దేవత వంటి సీరియల్ లో హీరో రోల్ చేసిన అర్జున్ అంబటి... మొదటి విడుతలోనే ఎంటర్ అవ్వాల్సింది. అయితే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్.. మరోవైపు రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో.. మొదటి విడుతలో ఎంటర్ అవ్వలేదు. అర్జున్ అంబటి అడిగిన రెమ్యూనరేషన్ బిగ్ బాస్ నిర్వహకులు ఇవ్వకపోవడంతో.. ఆయన వెనకడుగు వేస్తూ వచ్చాడు. ఇక అలా రెండో విడుతలో ఐదో వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.
ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడమే అర్జున్ అంబటికి శాపంగా మారిందనే చెప్పాలి. ఆ మిస్టేక్ చేయకపోయి ఉంటే.. అర్జున్ అంబటి ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండేదని అంటున్నారు నెటిజన్స్. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అర్జున్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అర్జున్ అంబటి.. మొదటి విడుతలోనే ఎంటర్ అయి ఉంటే.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే వారని.. అలా విన్నర్ అయ్యే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడని అంటున్నారు.
ఇక అర్జున్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వకుండా.. నెక్ట్స్ సీజన్ లో ఎంటర్ అయిన... విన్నర్ అయ్యే వాడని మరికొంతమంది అంటున్నారు. అలా అర్జున్ అంబటి మంచి గొల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు. ఎలాగు టాప్ 5 కంటెస్టెంట్స్ లో అర్జున్ అంబటి అయితే ఉన్నాడు. ఇక అర్జున్ రెమ్యూనరేషన్ వారానికి నాలుగున్నర లక్షలు అంటున్నారు. ఈ లెక్కన బాగానే వెనకేసుకున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది శోభా శెట్టి అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హౌస్ లో 6మంది ఉంటారు. వారిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో యావర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











