Bigg Boss Telugu 7: అర్జున్ అంబటి వైఫ్ వచ్చేసిందోచ్.. హౌస్‌లోనే సీమంతం, కప్పు ముఖ్యం బిగిలూ!
Arjun Ambati Wife in Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఈ వారం మరింత అద్భుతంగా సాగుతోంది. ఎప్పుడూ గొడవలు, కన్నీళ్లు, ఆటలతో సాగే ఈ బిగ్ బాస్ హౌస్ ఈ వారం ఫుల్ ఎమోషన్స్ తో నిండిపోబోతుంది. అందుకు కారణం పది వారాలుగా ఇంట్లో ఉంటున్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఈ వారం ఇంట్లోకి రాబోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ టీం విడుదల చేసిన మొదటి ప్రోమోలో.. శివాజి కొడుకు వెంకట్ డాక్టర్ గా ఇంట్లోకి వచ్చి అందరినీ షాక్ కు గురి చేశాడు. అత్యంత అద్భుతంగా వారిద్దరి బంధాన్ని చూపించిన బిగ్ బాస్ అదే స్థాయిలో మరో కంటెస్టెంట్ ను కూడా చూపించారు. అతను మరెవరో కాదు అంబటి అర్జున్.
అంబటి అర్జున్ ఇంట్లోకి వచ్చి నాలుగు వారుల అవుతుండగా.. తాజాగా ఈరోజు బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమోలో ఆయన భార్య అంబటి సురేఖ ఇంట్లోకి అడుగు పెట్టింది. దీంతో ముందుగా అందరూ షాకయ్యారు. భార్య సురేఖను చూడగానే అంబటి అర్జున్ ఫుల్ సర్ ప్రైజ్ అయ్యాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి భార్యను హత్తుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆమెను ఓ చోట కూర్చోబెట్టిన అర్జున్ ఆమె కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడాడు. ఈక్రమంలోనే సురేఖ.. నువ్వు నీ ఎమోషన్స్ ను బయట పెట్టు అని సూచించింది.

ఓన్లీ ఒక్కటే స్ట్రెస్.. అదేంటో చెప్పనా.. నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు అని అంబటి సురేఖ భర్త అర్జున్ కు చెప్పింది. అందుకు అర్జున్ నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత కప్పు ఇంపార్టెంట్ బిగిలూ అంటూ ఆమె చెప్పిన విధానం హైలెట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత సురేఖ.. స్వయంగా తన చేతులతో భర్త అర్జున్ కు అన్నం తినిపించింది. బయట సోఫాలో కూర్చున్న శివాజి.. దిస్ ఈజ్ ద లైఫ్.. దిస్ ఈజ్ ఓన్లీ ద లైఫ్ అంటూ.. సురేఖ, అర్జున్ ల గురించి చెప్పాడు. అది వింటున్న యావర్, భోలె, అమర్ దీప్, అశ్వినిలు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం సురేఖ గర్భిణీగా ఉండగా.. రాత్రిళ్లు బేబీ బాగా కదులుతుంది, పడుకోనివ్వట్లేదంటూ భర్త అర్జున్ కు చెప్పింది. వెంటనే అర్జున్ ఆమెను హత్తుకున్నాడు. ఇద్దరూ ఏడ్చేశారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ టేబుల్ పై కూర్చోగా.. హౌస్ మేట్స్ అంతా నిలబడ్డారు. అలాగే బయట ఏం జరుగుతుందో చెప్పమని అడగ్గా.. ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ చెప్పిన సురేఖ చాలా క్యూట్ గా నవ్వింది. ఇక ఆతర్వాత అశ్వినీతో మాట్లాడుతూ.. మా ఆయన అంటే భయం పోయిందా అని అడగ్గా.. అంతా గట్టిగా నవ్వారు.

ఇక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.. అర్జున్ అంబటి భార్యకు పండ్లు, గాజులతో ఉన్న పళ్లెం తీసుకు వస్తాడు. అది గమనించిన లేడీ కంటెస్టెంట్లు... వెంటనే ఓ చీర తీసుకొచ్చి సురేఖకు సీమంతం చేశారు. ఇది చూసిన అర్జున్ అంబటి తొలిసారిగా బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేశాడు. అది చూసిన ఆయన భార్య సురేఖ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత అంతా బొట్టు, పూలు, గంధం పెట్టి ఆమెను దీవించారు. ఈక్రమంలోనే అర్జున్ ఆమెను మరోసారి కౌగిలించుకోగా... అంతా వాళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. ఇక చివర్లో ఆమెను ఇంటి నుంచి అంతా కలిసి సాగనంపారు.


Click it and Unblock the Notifications











