Bigg Boss Telugu 6: తొలిరోజే రొమాంటిక్ సీన్.. ఒక చాక్లెట్ ఇద్దరు నోట్లో.. అప్పుడే మొదలైన డౌట్స్
తెలుగు బుల్లితెరపై పెట్టుకున్న హద్దులను చెరిపేస్తూ.. సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన షో బిగ్ బాస్. ఊహించని సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్, కంటెస్టెంట్ల ఫైటింగ్స్ ఇలా ఎన్నో రకాల సీన్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌కు పరిమితులు ఉండవని నిరూపించిన ఈ షో.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని సత్తా చాటింది.
అదే సమయంలో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేసింది. ఇక, ఇప్పటికే కొన్ని సీజన్లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్.. ఆదివారమే ఆరో సీజన్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మొదటి రోజే ఇందులో ఓ రొమాంటిక్ టాస్కును పెట్టారు. దీంతో ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఎంతో గ్రాండ్‌గా మొదలైన సీజన్
తెలుగులో బిగ్ బాస్ షోకు ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రతి ఏడాది ప్రసారం అవుతోన్న ఈ రియాలిటీ షోకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో ఇది ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఆదివారం సాయంత్రం ఆరో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు.

బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్
ఆరో సీజన్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ ఎపిసోడ్‌లోనే కొత్త టాస్కులు
మామూలుగా బిగ్ బాస్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను పరిచయం చేసి.. వాళ్ల ఆటపాటలు ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఆయా కంటెస్టెంట్లు మాట్లాడతారు. అనంతరం వాళ్లను హోస్టు హౌస్ లోపలికి పంపుతాడు. అయితే, ఆరో సీజన్‌లో మాత్రం ఆరంభ ఎపిసోడ్‌లోనే కొంత మంది కంటెస్టెంట్లతో హోస్ట్ నాగార్జున టాస్కులు ఆడించారు. ఇవన్నీ ఆసక్తికరంగా సాగిపోయాయి.

షోలోకి అర్జున్ కల్యాణ్ ఎంటర్
బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్‌గా సాగుతోంది. ఇందులోకి ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏడో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కల్యాణ్ వచ్చాడు. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీలోని పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అతడికి అక్కినేని నాగార్జున గ్రాండ్ వెల్‌కం చెప్పి ఆహ్వానించాడు.

చాక్లెట్ టాస్క్ ఇచ్చిన నాగార్జున
అర్జున్ కల్యాణ్ అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీదకు వచ్చాడు. ఆ సమయంలో నాగార్జునకు తాను పెద్ద అభిమానినని చెప్పిన అతడు.. చిన్నప్పటి నుంచి జరిగిన ఎన్నో సినిమాలకు సంబంధించిన విషయాలను ఆయనతో పంచుకున్నాడు. చివర్లో అర్జున్‌కు నాగార్జున ఒక చాక్లెట్ ఇచ్చాడు. దాన్ని హౌస్‌లో ఉన్న వాళ్లతో షేర్ చేసుకోమని (ఇద్దరూ ఒకేసారి కొరికాలి) చెప్పాడు.

ఆమెతో టాస్క్.. రొమాంటిక్‌గానే
ఆ తర్వాత నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లతో మాట్లాడాడు. ఆ సమయంలో అర్జున్ కల్యాణ్ చాక్లెట్ టాస్క్ గురించి అడిగాడు. దీంతో అతడు ఎవరితో షేర్ చేసుకోవాలా అని ఆలోచించాడు. ఆ సమయంలో నేరుగా శ్రీ సత్య దగ్గరకు వెళ్లి అడిగాడు. మొదట ఆమె ఈ టాస్కును చేసేందుకు నిరాకరించినా.. తర్వాత అతడితో కలిసి చాక్లెట్‌ను కొరుక్కుని మరీ తినేసింది.

చాక్లెట్ ఇష్టం లేదని.. జంటగా
మొదట శ్రీ సత్య బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు నాగార్జున ఆమెకు కొన్ని జంక్ ఫుడ్ ఐటమ్స్ ఇచ్చాడు. అందులో తనకు చాక్లెట్ అంటే ఇష్టం లేదని చెప్పింది. కానీ, అర్జున్ కల్యాణ్ టాస్కు కోసం మాత్రం ఆమె చాక్లెట్‌ను ఏకంగా నోటితో కొరుక్కుని మరీ తినేసింది. దీంతో బిగ్ బాస్ నిర్వహకులు కావాలనే వీళ్లిద్దరినీ జంటగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











