Bigg Boss Telugu 6: హౌస్‌లోకి టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరీ అర్జున్? అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మద్దతును అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా హిందీలో ఎప్పుడో మొదలైన ఇది.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే వచ్చింది. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఈరోజే (సెప్టెంబర్ 4) ఆరో సీజన్‌ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులోకి టాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకీ ఎవరీ కుర్రాడు? అతడి గురించి పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

నేషనల్ టాప్ షో.. అంచనాలతో

నేషనల్ టాప్ షో.. అంచనాలతో

ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి వచ్చిన రియాలిటీ షోనే బిగ్ బాస్. కంటెస్టెంట్ల మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలో సాగే ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. దీంతో ఇది ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. దీంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది కొత్తగా రాబోతుంది.

వైభవంగా మొదలైన ఆరో సీజన్

వైభవంగా మొదలైన ఆరో సీజన్

తెలుగులో బిగ్ బాస్ షోకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే దక్కుతోంది. దీంతో ఆరో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దీనికి కూడా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతోంది.

ఎక్కువగా వాళ్లకే అవకాశం ఇస్తూ

ఎక్కువగా వాళ్లకే అవకాశం ఇస్తూ

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి చాలా రకాల ప్రచారాలు జరిగాయి. అయితే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా పరిచయం ఉన్న సెలెబ్రిటీలనే తీసుకు వచ్చారు. అందులోనూ ఎక్కువగా ఆడవాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో కొందరు బోల్డు బ్యూటీలు కూడా ఉన్నారు. దీంతో ఇది ఆసక్తిగా మారింది.

హౌస్‌లోకి ఎంటరైన యంగ్ హీరో

హౌస్‌లోకి ఎంటరైన యంగ్ హీరో

బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్‌గా సాగుతోంది. ఇందులోకి ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏడో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కల్యాణ్ వచ్చాడు. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీలోని పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అతడికి అక్కినేని నాగార్జున గ్రాండ్ వెల్‌కం చెప్పి ఆహ్వానించాడు.

అలా వచ్చి... నాగ్‌కు గిఫ్టు కూడా

అలా వచ్చి... నాగ్‌కు గిఫ్టు కూడా

అర్జున్ కల్యాణ్ అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీదకు వచ్చాడు. ఆ సమయంలో నాగార్జునకు తాను పెద్ద అభిమానినని చెప్పిన అతడు.. చిన్నప్పటి నుంచి జరిగిన ఎన్నో సినిమాలకు సంబంధించిన విషయాలను ఆయనతో పంచుకున్నాడు. ఆ తర్వాత ఓ వినాయకుడి బొమ్మను కూడా నాగ్‌కు గిఫ్టుగా ఇచ్చాడు. అది మళ్లీ అర్జున్‌కే ఇచ్చి ఆల్‌ ది బెస్ట్ చెప్పి పంపించాడు.

అసలు ఎవరీ అర్జున్ కల్యాణ్?

అసలు ఎవరీ అర్జున్ కల్యాణ్?

ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరుకు చెందిన అర్జున్ కల్యాణ్.. విశాఖపట్నంలో బీటెక్ చదివాడు. ఆ తర్వాత యూఎస్ వెళ్లి యాక్టింగ్ కోర్సులు నేర్చుకున్నాడు. అలా వచ్చిన తర్వాత మోడల్‌గా మారాడు. అనంతరం 'లవర్ ఫరెవర్', 'ఉప్మా తినేసింది', 'అన్‌స్పోకెన్', 'పరిచయం', 'మిస్సమ్మా' అనే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించాడు.

చైతూ మూవీలో.. ఆ సినిమాలు

చైతూ మూవీలో.. ఆ సినిమాలు

అర్జున్ కల్యాణ్ 2013లో వచ్చిన 'చిన్న సినిమా' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన 'ప్రేమమ్'లో అనుపమ బాయ్‌ఫ్రెండ్‌గా నటించాడు. అనంతరం 'ప్లే బ్యాక్', 'వరుడు కావలెను', 'పెళ్లికూతురు పార్టీ' అనే సినిమాలు చేశాడు. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చనని అర్జున్ వెల్లడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X