Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
శ్రీసత్య కోసం కొట్టుకున్న అర్జున్ కల్యాణ్-మెహబూబ్.. డ్యాన్స్ ప్రాక్టీస్ మధ్యలో గొడవ, వీడియో వైరల్
బుల్లితెరపై వచ్చిన రియాలిటీ షోలలో ఎక్కుగా పాపులారిటీ సంపాందించుకుంది బిగ్ బాస్. ఈ షోలో పలువురి కంటెస్టెంట్స్ మధ్య ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు కొంతమందిని ఆకట్టుకుంటే మరికొంతమందికి చిరాకు తెప్పించాయి. ప్రతి సీజన్ లో ఏదో ఒక జంట కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇటీవల బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఆరో సీజన్ లో బ్యూటిఫుల్ శ్రీసత్యపై అర్జున్ కల్యాణ్ మనసు పారేసుకున్నాడని బిగ్ బాస్ హౌజ్ లో అతని ప్రవర్తను బట్టే చెప్పవచ్చు. ఇప్పుడు ఈ జంట బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంటుంది. అయితే ఇద్దరు వేరు వేరు జంటలతో పార్టిస్ పేట్ చేస్తున్నారు. శ్రీసత్యతో మెహబూబ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అర్జున్ కల్యాణ్ తో మొదలైన గొడవ ఆఖరుకు ఏమైందనే వివరాల్లోకి వెళితే..
గేమ్ పరంగా బాగా వాడుకుని..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో 21 మంది కంటెస్టెంట్స్ లో శ్రీసత్య, అర్జున్ కల్యాణ్ ఒకరు. సీజన్ ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న శ్రీసత్య తర్వాత తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆమె వెంట అర్జున్ కల్యాణ్ ఎంత పడినా తను మాత్రం హద్దుల్లో ఉంది. కానీ అతన్ని హౌజ్ లో గేమ్ పరంగా శ్రీసత్య బాగా వాడుకుందని విమర్శలు తెగ వినిపించాయి. అది ఆమెకు తీవ్రమైన నెగెటివిటీని తీసుకొచ్చింది. శ్రీసత్య పట్టించుకోకున్న అర్జున్ కల్యాణ్ అలా వెంటపడటం, ఆటపై శ్రద్ధ పెట్టకపోవడంతో అతనికి కూడా మైనస్ అయింది.
వెంటకారం చూపించకుండా..
ఇక అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయ్యాక రేవంత్, శ్రీహాన్ లతో శ్రీసత్యకు మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ఏర్పడింది. అప్పుడే ఇతరులపై వ్యంగంగా మాట్లాడటంతో మరింత నెగెటివిటీ తెచ్చుకుంది శ్రీసత్య. బిగ్ బాస్ హౌజ్ లో ఫ్యామిలీ వీక్ నుంచి శ్రీసత్య ఆట, ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఏమాత్రం కూడా వెటకారం చూపించకుండా టాస్క్ లలో అద్భుతంగా ప్రదర్శన కనబర్చింది. అయితే ఆమె చూపించిన వెటకారాన్ని భరించలేని ప్రేక్షకులు ఆమె ఎప్పుడెప్పుడు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతుందా అని ఎదురుచూశారు.
అషు రెడ్డి తప్పుకోవడంతో సత్యకు..
బిగ్ బాస్ తెలుగు 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద శ్రీసత్యను ఎలిమినేట్ చేసి బయటకు పంపారు. అయితే ఆరో సీజన్ పూర్తి కాకముందే వివిధ జంటలతో బీబీ జోడీ మొదలు పెట్టేశారు. అర్జున్ కల్యాణ్ కు వాసంతి కృష్ణన్ జోడీగా ఉండగా.. మెహబూబ్ కి మొదట్లో అషు రెడ్డి ఉండేది. అయితే పలు కారణాల వల్ల అషు రెడ్డి తప్పుకోవడంతో.. ఆ అవకాశం శ్రీసత్యకు లభించింది. దీంతో మెహబూబ్-శ్రీసత్య ఒక జోడీగా డ్యాన్స్ తో అలరిస్తున్నారు.
వెరీ క్యూట్ డ్యాన్స్ అంటూ..
ఈ డ్యాన్స్ షో బీబీ జోడీకి బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ కొనసాగనున్నారు. డ్యాన్స్ ప్రాక్టీస్ లో భాగంగానే సత్య, మెహబూబ్ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ల డ్యాన్స్ చూసిన అర్జున్.. వెరీ క్యూట్ డ్యాన్స్ అని కామెంట్ చేశాడు. ఆ మాటకు సీరియస్ అయ్యాడు మెహబూబ్.
అలా అంటే నేను డ్యాన్స్ చేయను..
నీ ప్రాక్టీస్ చేసుకోవడం అయిపోయింది కదా వెళ్లిపో అని మెహబూబ్ అంటే.. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా.. వస్తుంది. అప్పటి దాకా ఇక్కడే ఉంటా అని కల్యాణ్ కూడా సీరియస్ గా అన్నాడు. తను వెళ్తేనే ప్రాక్టీస్ చేస్తానని.. అలా డిస్టర్బ్ చేయకు కల్యాణ్ అని మెహబూబ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నేను డిస్టర్డ్ ఎక్కడ చేశాను.. కాంప్లిమెంటేగా ఇచ్చాను అని అర్జున్ అన్నాడు. దానికి తను అలా కామెంట్స్ చేస్తే నువ్వు డ్యాన్స్ చేస్తావేమో కాని నేను చేయను అని శ్రీసత్యతో మెహబూబ్ అన్నాడు.
నువ్ లేట్ రావడం వల్లే ఇదంతా..
మీరు బీబీ జోడి.. రియల్ జోడీ కాదు అని కల్యాణ్ మళ్లీ మెహబూబ్ ను రెచ్చగొట్టాడు. దీంతో అక్కడ పెద్ద గొడవ అయింది. మెహబూబ్ ఎవరు చెప్పిన వినలేదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్నవాళ్లను తోసుకుంటూ, చేతులతో పక్కకు కొడుతూ హంగామా చేశాడు. అర్జున్ కల్యాణ్ వైపుకి కూడా కొట్టేలా వెళ్లాడు. అర్జున్ కూడా అదే కోపంతో ఊగిపోయాడు. తర్వాత నువ్ లేట్ రావడం వల్లే ఇదంతా. నీకు కంఫర్ట్ లేనప్పుడు చెప్పొచ్చుగా.. నవ్వడం ఎందుకు అని శ్రీసత్యపై ఫైర్ అయ్యాడు మెహబూబ్.
బిత్తరపోయిన శ్రీసత్య..
మెహబూబ్
తనపై
అలా
సీరియస్
కావడంతో..
సత్య
కూడా
కోపంగా
నేను
ప్రాక్టీస్
చేయను.
ఛానెల్
వాళ్లకు
ఫోన్
చేసి
చెప్పేస్తానని
వెళ్లబోయింది.
అప్పుడు
కూడా
మెహబూబ్
సీరియస్
గానే
ఉన్నాడు.
ఆఖరుకు
శ్రీసత్య
వెళ్లబోతుంది
అనే
సమయంలో..
నవ్వుతూ
వచ్చి
ఇదంతా
ప్రాంక్
అని
చెప్పాడు
మెహబూబ్.
అలా
అనేసరికి
బిత్తరపోయి
చూసింది
శ్రీసత్య.
తన
కోసం
గొడవ
పడితే
ఎలా
ఉంటుందో
చూద్దామని
అర్జున్,
మెహబూబ్
ఇద్దరు
కలిసి
శ్రీసత్యపై
ప్రాంక్
చేసినట్లు
చెప్పుకొచ్చారు.
అలా
సత్య
కోసం
వీళ్లు
కొట్టుకున్న
వీడియో
ప్రస్తుతం
వైరల్
అవుతోంది.