BB Jodi టైటిల్ రాకపోవడానికి కారణం అతని తప్పే.. ఇబ్బందిగా ఉంది.. వాసంతి-అర్జున్ కామెంట్స్
తెలుగులో 2017లో ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్నో అంచనాలు, అనుమానాల మధ్య స్టార్ట్ అయిన ఈ షో ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. కానీ గతేడాది వచ్చిన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మాత్రం ఫ్లాప్ గా మిగిలింది. దీంతో దాన్ని భర్తీ చేసేందుకు బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోను ప్రవేశ పెట్టింది స్టార్ మా. ఈ షో మాత్రం పర్వాలేదనిపించుకోంది.
ఇక ఈ షో ఫస్ట్ సీజన్ కూడా ఇటీవలే ముగిసింది. ఇందులో టైటిల్ విజేతగా ఆర్జే సూర్య అండ్ ఫైమా జోడీ గెలిచి రూ. 25 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ అందుకున్నారు. అయితే ఇందులో క్యూట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్ తాము ఓడిపోవడానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు.

మొత్తంగా 9 జోడీలు..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఫ్లాప్ తర్వాత బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోను ప్రారంభించారు మేకర్స్. ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మగా పేరొందిన బొద్దుగుమ్మ శ్రీముఖి హోస్ట్ గా చేసింది. ఈ షోలో మొత్తంగా 9 జోడీలు పాల్గొన్న విషయం తెలిసిందే.

అదిరిపోయే డ్యాన్స్.. ఘాటు రొమాన్స్
కమెడియన్ అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి, అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ, రోల్ రైడా-ఇనయా సుల్తానా అయిన ఈ 9 జోడీలు ప్రతివారం అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాయి. అంతేకాకుండా ఘాటు రొమాంటిక్ సాంగ్స్ తో అంతకుమించిన రొమాన్స్ పండించి ఇటు ప్రేక్షకులు, అటు న్యాయ నిర్ణేతలను సైతం ఔరా అనిపించారు.

మూడో రన్నరప్ గా..
ఇక బీబీ జోడీ టైటిల్ విన్నర్ గా ఆర్జే సూర్య-ఫైమా నిలిచారు. అలాగే రన్నరప్ గా అవినాష్-అరియానా జోడీ నిలివగా మూడో రన్నరప్ గా వాసంతి-అర్జున్ మిగిలారు. దీంతో ఈ షోపై కూడా విమర్శలు తలెత్తాయి. టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అర్జున్-వాసంతికే ఉన్నాయని.. కనీసం రన్నరప్ కూడా ఇవ్వలేదని కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే వారు టైటిల్ గెలవకపోయేందుకు గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ఈ జోడి.

బాగా ఎక్కేసింది..
"బీబీ జోడి అంటే ఏదో ఆటాపాటా చేసుకుంటూ పోదాంలే అనుకున్నాం. కానీ మా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టాప్ 3కి వెళ్లడం అంటే మాములు విషయం కాదు. టైటిల్ గెలవకపోవడం బ్యాడ్ లక్. బిగ్ బాస్ తో మేం కనెక్ట్ కాలేదు. కానీ బీబీ జోడీతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాం. మా టాలెంట్ ను చూపించడానికి మాకు వేదిక దొరికింది. మాకు బీబీ జోడి బాగా ఎక్కేసింది. బీబీ జోడీ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది. సీజన్ అయిపోవడంతో చాలా మిస్ అయ్యాం అనిపిస్తుంది" అని అర్జున్-వాసంతి తెలిపారు.

నెగెటివ్స్ ఎక్కువగా..
"సెమీ ఫైనల్ లో మేం చాలా కష్టపడ్డాం. ఫైనల్ లో డివోషనల్ సాంగ్ చేశాం. కాస్తా ఎంటర్టైన్ మెంట్ తగ్గిందన్నారు. కాకపోతే అది కొరియోగ్రాఫర్ ఛాయిస్. ఫైనల్ లో డివోషనల్ సాంగ్ అయితే పక్కగా కప్పు కొడతాం అని అతని సెంటిమెంట్. కానీ అది మాకు వర్కౌట్ కాలేదు. రివర్స్ కొట్టింది. షోలో పాజిటివ్స్ కంటే నెగెటివ్స్ ఎక్కువ వెతుక్కునేవాళ్లు. కాంపిటీషన్ కాబట్టి గొడవలు ఉండేవి. మొదట్లో జడ్జీలు దగ్గరి నుంచి కాంప్లిమెంట్స్ వచ్చేవి కావు. తర్వాత చాలా ఎంకరేజ్ చేశారు" అని వాసంతి-అర్జున్ పేర్కొన్నారు.

ఫినిషింగ్ పోస్టర్స్.. డ్యాన్స్ రిలేటెడ్
"మొదట్లో రవి-భాను, అఖిల్-తేజస్విలు మాకు బెంచ్ మార్క్ గా ఉండేవాళ్లు. ఈ రెండు జోడీలు ఔట్ స్టాండింగ్. తేజస్వి అయితే ఫినిషింగ్ పోస్టర్స్ అదిరిపోయేవి. వాళ్లలాగా చేయాలి అనిపించింది" అని ఈ క్యూట్ పెయిర్ అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్ చెప్పుకొచ్చారు. బీబీ జోడీ తర్వాత డ్యాన్స్ రిలేటెడ్, పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు వస్తే చేస్తానని తెలిపింది మోస్ట్ బ్యూటిఫుల్ వాసంతి కృష్ణన్.


Click it and Unblock the Notifications











