Bigg Boss Telugu 6: శ్రీ సత్యతో అర్జున్ పులిహార.. తనపై ఫీలింగ్ ఉందని శ్రీహాన్ కన్ఫర్మ్!

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మూడో వారంలో కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చివరి దశలో కూడా అరుపులు, కేకలతో రసవత్తరంగా సాగినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోను విడుదల చేశారు. సెప్టెంబర్ 22న జరిగే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో కేకలతోపాటు లవ్ ట్రాక్ ముచ్చట్లు కూడా దర్శనమిచ్చాయి. మొత్తంగా ఒక నిమిషం 38 సెకన్ల పాటు విడుదల చేసిన ఈ ప్రోమో ఆసక్తికర విశేషాలేంటో చూద్దాం.

లవ్ ట్రాక్ లు సాధారణమే..

లవ్ ట్రాక్ లు సాధారణమే..

బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ లు జరగడం సర్వ సాధారణమే. ఇప్పటివరకు జరిగిన సీజన్ లలో కంటెస్టెంట్ల మధ్య జరిగిన కొందరి లవ్ ట్రాక్ లను ప్రేక్షకులు ఆదరిస్తే కొన్ని విమర్శల పాలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ఆరో సీజన్ లో కూడా లవ్ ట్రాక్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా తాజగా విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ సెప్టెంబర్ 22వ ఎపిసోడ్ ప్రోమో తోస్తుంది.

చివరి దశకు..

చివరి దశకు..

ఈ ప్రోమో చూస్తుంటే మూడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నిర్వహించిన అడవిలో ఆట గేమ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దొంగలు, పోలీసుల మధ్య ఆట పోటీపోటీగా సాగింది. పోలీసుగా ఉన్న మెరీనా తన కప్ బోర్డ్ లో వస్తువులు వెతకడంతో నేహా చౌదరి ఫైర్ అయింది. ఇది రైడ్ చేసే సమయమా.. రైడ్ సమయంలో మాత్రమే వెతకాలని, లేకుంటే తాను కూడా అడవిలో వస్తువులు దొంగలిస్తా అని అరిచింది.

నేహా, మెరీనా గొడవ..

నేహా, మెరీనా గొడవ..

దీంతో నా కప్ బోర్డ్ నేను చూసుకుంటే తప్పేంటీ అని మెరీనా ఫైర్ అయింది. కాస్తా బుద్ధి ఉండాలి అంటూ మాట్లాడింది. మరోవైపు గీతూ తన బొమ్మలను అమ్ముతూ కనిపించింది. ఒక్కో బొమ్మకు రూ. 100 చొప్పున అమ్ముతూ ఒక బహుమతి కూడా ప్రకటించింది. గీతూ వద్ద అర్జున్ తదితర కంటెస్టెంట్ లు బొమ్మలు అమ్మడం ప్రొమోలో చూడొచ్చు.

పోలీసులు గెలిచినట్లుగా..

అయితే చివిరికీ కంటెస్టెంట్లంతా బృందాలుగా విడిపోయి.. ఎవరికీ వారే గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. దొంగల్లో ఐక్యత లేకపోవడంతో చివిరికి వారే ఓడిపోయి, పోలీసులు గెలిచినట్లు సమాచారం. ఇది పూర్తి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యాకే తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు చిన్నపాటి లవ్ ట్రాక్ మొదలు పెట్టినట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.

అర్జున్ పులిహోర..

అర్జున్ పులిహోర..

శ్రీ సత్యతో అర్జున్ పులిహోర కలుపుతూ మాట్లాడుతుంటాడు. ''నేను అందరినీ అన్నయ్యే అనే పిలుస్తానని అనుకున్నాను. కానీ, దాన్ని యాక్సెప్ట్ చేయడం, చేయకపోవడం వాళ్ల ఇష్టం'' అని అర్జున్ తో శ్రీ సత్య చెప్పింది. దీనికి వావ్.. వావ్.. అంటూ అనడం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు అర్జున్. ఇక మరోవైపు వీళ్లిద్దరి గురించి నేహా, శ్రీహాన్ మాట్లాడుకున్నారు.

శ్రీహాన్ కు నేహా ప్రశ్న..

శ్రీహాన్ కు నేహా ప్రశ్న..

వాళ్లిద్దరి మధ్య (అర్జున్-శ్రీ సత్య) ఏం జరుగుతుంది అని నేహా అడగ్గా.. ''ఆ అమ్మాయి మీద అర్జున్ కు ఫీలింగ్ ఉంది'' అని శ్రీహాన్ అన్నాడు. తర్వాత ''తాను ఏం మాట్లాడిన వావ్, సూపర్ అంటాడు'' అని నేహా చెప్పడంతో ప్రోమో ముగిసింది. మరి వీళ్ల ట్రాక్ ఎలా వెళుతుందో సెప్టెంబర్ 22 గురువారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X