ఏదోలా చూస్తున్నాడు హౌస్ లో ఒక్కదాన్నే ఉంటే నా పరిస్థితి ఏంటి.. లోబో చూపులపై ప్రియ అనుమానాలు

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూనే ఉంటుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఆప్యాయతలు ప్రేమలు క్షణం కాలంలోనే మారుతూ ఉన్నాయి. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ విషయంలో అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉన్నారు. చాలా వరకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. స్ట్రాటజీని ఫాలో అవుతున్నప్పటికి కూడా ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకోవడం లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ముందు ప్రియా చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ వారం నామినేట్ చేసే సమయంలో లోబో ప్రవర్తించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేయడం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

 పట్టించుకోవడం లేదని

పట్టించుకోవడం లేదని

బిగ్ బాస్ హౌస్ లో దాదాపు అందరి మధ్య ఏదో ఒక బంధం అయితే ఉంటుంది. ఒకరికి ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం లేదా గొడవ పడటం జరుగుతూనే ఉంటుంది. ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేకపోయినా కూడా బిగ్ బాస్ ఆలోచించి ఏదో ఒక టాస్క్ తో ఇరికించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లలో ప్రియ , లోబో మధ్యలో మాత్రం కాస్త డిస్టెన్స్ ఎక్కువగానే ఉంది.

ఎప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుకున్నట్లు కనిపించలేదు. ఇక రెండు మూడు సార్లు ఎక్కువగా గొడవలు జరిగాయి. ఆ గొడవలతో ఇద్దరి మధ్య దూరం కూడా బాగానే పెరిగింది. లోబో ఎక్కువగా పట్టించుకోవడం లేదు అని అతనితో సెట్ అవ్వదని ప్రియ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది.

ప్రియపై అరిచేసిన లోబో

ప్రియపై అరిచేసిన లోబో

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో మాత్రం ఎదురు పడక తప్పదు. ఇక నామినేట్ చేసే సమయంలో మాత్రం తప్పకుండా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వారం నామినేషన్స్ జరిగినప్పుడు ప్రియ పై లోగో ఒక్కసారిగా హరి చేసిన విషయం తెలిసిందే.

ప్రేమకథలు చెబుతున్నప్పుడు అందరూ ఎంతగానో కనెక్ట్ అయ్యారని ఎంతో భావోద్వేగంతో చెబుతూ ఉంటే ప్రియ గారు మాత్రం అది సినిమా కథ అని అనడం అస్సలు నచ్చలేదని తెలియజేశాడు. అందుకే నామినేట్ చేస్తున్నాను అని భావిస్తున్న సమయంలో ప్రియా మరొక సమాధానం ఇవ్వు బోతుంటే లో నన్ను పూర్తి చేయని అంటూ గట్టిగా అరిచాడు.

నాగార్జున సీరియస్

నాగార్జున సీరియస్

అది ఒక్కసారిగా లోబోపై నెగిటివ్ అభిప్రాయాన్ని కలుగజేసింది. ఇంట్లో ఉన్న మిగతావాళ్లు కూడా లోబో తిరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. లోబో ఆ రోజు అలా అవ్వకుండా ఉండాల్సింది అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక శనివారం ఎపిసోడ్ లో కూడా నాగార్జున లోబో మాట తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలా అనవసరంగా అరవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు ఏదైనా ఉంటే సమాధానం కరెక్ట్ గా చెప్పి నీ ఆవేశాన్ని చూపించు కానీ అలా అనవసరంగా అరవడం ఏమాత్రం కరెక్ట్ కాదని అన్నారు ప్రతి సారి కూడా సింపతి కార్డులు ప్లే చేయకూడదు అంటే కూడా సెటైర్ వేశారు.

ప్రియ అనుమానాలు

ప్రియ అనుమానాలు

ఇక ఆ తరువాత ప్రియ కూడా లోబో చూపులపై అనుమానాలు వ్యక్తంచేసింది. అందరితో నాకు ఒక రిలేషన్ అయితే ఉంది దాదాపు అందరు నాతో మాట్లాడుతున్నారు. కానీ లోబోతో మాత్రం ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడింది లేదు. కాని ప్రతి సారి కూడా అతను ఏదోలా చూస్తున్నాడు. అతని చూపులను చూస్తుంటే నాకు ఎందుకో సరిగా అనిపించడం లేదు.బిగ్ బాస్ హౌస్ లో తను నేను మాత్రమే ఉంటే తప్పకుండా నేను అయితే బయటికి వెళ్లిపోతాను అతని చూపులు నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నాకు మాత్రం సేఫ్ గా కనిపించడం లేదు అని ప్రియ తెలియజేసింది.

ఎలాంటి భయం అవసరం లేదు

ఎలాంటి భయం అవసరం లేదు

ఇక ప్రియ చేసిన కామెంట్స్ కు నాగార్జున కూడా సమాధానం ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో నీకు ఎలాంటి భయం అవసరం లేదు అంటూ ఇక్కడ అందరూ సేఫ్ గా ఉంటారు అని భరోసా ఇచ్చారు. ఒక విధంగా లోబో పైన దాదాపు అందరూ కంప్లైంట్ చేశారు. నిజంగా ఆ రోజు లోబో అలా ప్రవర్తించి ఉండకూడదు అంటూ తన నాలుకను కంట్రోల్లో ఉంచుకోవాలని కొంచెం తెలివివా కూడా ఆలోచించాలని నాగార్జున ముందు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారు అందరూ కూడా ఏదో ఒక విధంగా బాగానే ఆడుతున్నారు

లోబో ఒక్కసారిగా మారిపోతున్నాడు

లోబో ఒక్కసారిగా మారిపోతున్నాడు

అంటూ లోబో మాత్రం అప్పుడప్పుడు సడన్ గా మారిపోతున్నాడు అని కంప్లైంట్ చేశారు చేస్తున్నారు. అందరినీ నవ్విస్తున్నా కూడా నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే టప్పుడు మాత్రమే ఎవరు చెప్పినా ఎవరి మా వినడం లేదని ఒక్క సారి గా మారిపోతూ ఉండడంతో అతనితో మాట్లాడి ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అని కూడా వివరణ ఇచ్చుకోవడంతో లోబో తప్పకుండా తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాం అని ఒప్పుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X