twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హద్దులు దాటేసింది.. ఏకంగా ముద్దు పెట్టేసింది.. అషూ రెడ్డి పనికి అంతా షాక్

    |

    బుల్లితెర షోలు ఎంతగా దిగజారిపోతోన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంటర్టైన్మెంట్ పేరిట డబుల్ మీనింగ్ డైలాగ్స్, హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతున్నారు. ప్రతీ ఒక్కరూ తమ తమ టీఆర్పీలను పెంచుకునే క్రమంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. లవ్ ట్రాక్‌లను జొప్పిస్తున్నారు.. లేని ప్రేమను వారి మధ్య పుట్టించి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ షో శ్రుతి మించిపోయినట్టు కనిపిస్తోంది.

    జబర్దస్త్‌లో అలా..

    జబర్దస్త్‌లో అలా..

    ఇప్పటికే బుల్లితెరపై జబర్దస్త్ షోనే కింగ్‌లా ఉండేది. అందులో ఎంతటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లున్నా కూడా ముద్దుల వరకు వ్యవహారం వెళ్లలేదు. అందరూ లేడీ గెటప్ ఆర్టిస్ట్‌లతోనే స్కిట్లను కానిచ్చేవారు. కానీ ఈ మధ్య మాత్రం బుల్లితెరపై మీద కూడా రొమాన్స్ హద్దులు దాటుతోంది.

    కామెడీ స్టార్స్‌లో రచ్చ..

    కామెడీ స్టార్స్‌లో రచ్చ..

    బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అదిరింది టీంతో కలిసి కామెడీ స్టార్స్‌ను గ్రాండ్‌గానే లాంచ్ చేశారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు పోటీగా వచ్చిన ఈ షో బాగా క్లిక్ అయింది. అయితే ఇందులో అషూ, అరియానా, అవినాష్‌లు చేసే హంగామా మాత్రం అంతా ఇంతా కాదు.

    అరియానా అవినాష్ అలా..

    అరియానా అవినాష్ అలా..

    అరియానా అవినాష్‌లు తమ జోడికి బయట ఉన్న క్రేజ్‌ను ఇలా వాడేసుకుంటున్నారు. తమ మధ్య ఏర్పడిన కెమిస్ట్రీని జనాలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారని, మొగుడు పెళ్లాం, లవర్స్ వంటి పాత్రలతో స్కిట్‌లను చేసేస్తున్నారు. అయితే అషూ మాత్రం ఈ మధ్యే రూట్ మార్చేసింది.

    ట్రాక్ కోసం పాకులాట..

    ట్రాక్ కోసం పాకులాట..

    బుల్లితెరపై సక్సెస్ అవ్వాలంటే ఓ ట్రాక్ ఏర్పడాలి. అందుకే గత వారం ఎపిసోడ్‌లో ఫ్లోర్ మీద జారుతూ ఉండగా.. ఆమె కోసం ఎక్స్ ప్రెస్ హరి, అవినాష్ ఇలా అందరూ రెడీగా ఉన్నారు. ఇక అషూ కూడా కావాల్సినంత గ్లామర్‌ను ఒలకబోస్తోంది.

    ముద్దు పెట్టేసింది..

    ముద్దు పెట్టేసింది..

    అయితే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో అషూ రెడ్డి రెచ్చిపోయింది. ఎక్స్ ప్రెస్ హరితో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడమే కాకుండా.. హగ్ చేసుకుంది.. అంతటితో ఆగకుండా.. ముద్దు కూడా పెట్టేసింది. ఆమె అలా ముద్దు పెట్టేయడంతో శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

    English summary
    Ashu kisses express hari in In Comedy Stars, Express Hari And Avinash Fun with Ashu In Comedy Stars..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X