అలా పిలవడంతో షాక్.. ఎక్స్‌ప్రెస్ హరిని కాలితో ఎగిరి తన్నిన అషూ!
బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బుల్లితెరపై అషూ చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు. కామెడీ స్టార్స్ షోలో ఎక్స్ ప్రెస్ హరితో కలిసి అషూ పండించే కెమిస్ట్రీ బాగానే క్లిక్ అవుతోంది. బుల్లితెరపై మరో కొత్త జంటగా వీరు అవతరించేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రపోజ్ చేసుకోవడం, హగ్గులు, ముద్దులతో ఆన్ స్క్రీన్ మీద హీటెక్కిస్తున్నారు.

కామెడీ స్టార్స్‌లో రచ్చ..
కామెడీ స్టార్స్ షోలో అవినాష్ సుజాత అషూ రెడ్డి అరియానాలు చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు కామెడీ స్టార్స్ షోలో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే స్మాల్ స్క్రీన్ అనగానే ఏవో ఒక ట్రాకులు ఉండాల్సింది. అరియానా అవినాష్ ఆ కేటగిరీలో బాగానే సెట్ అయ్యారు.

కొత్త ట్రాక్..
అషూ రెడ్డి ఎక్స్ ప్రెస్ హరిల రూపంలో కొత్త ట్రాక్ ముందుకు వచ్చేలా ఉంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో క్లిక్ అవుతోంది. ఆ మధ్య ఎక్స్‌ప్రెస్ హరిని హగ్ చేసుకుని ఏకంగా ముద్దు పెట్టేసింది. దీంతో హరి స్టేజ్ మీద కుప్పకూలిపోయాడు. మరో సందర్భంగా పర్ఫామెన్స్ చేస్తూ ప్రపోజ్ చేసేశాడు.

తాజాగా అలా..
ఇక ప్రసారమైన ఈ షోలో అషూ రెడ్డిపై బాబా భాస్కర్ ఓ రేంజ్‌లో కామెంట్ చేశాడు. పానీ పూరి తినే చాలెంజ్ పెట్టాడు బాబా. అయితే తాను డైటింగ్‌లోఉన్నాను అని అషూ అనడం.. డైటింగ్‌లో ఉంటేనే ఇలా ఉన్నావా? అంటూ ఆమె పరువుతీసేశాడు.
స్కిట్‌లో చెల్లెమ్మా అంటూ..
తాజాగా వేసిన స్కిట్‌లో ఎక్స్ ప్రెస్ హరి తనకు అషూతో ఉన్న రిలేషన్‌ను మార్చేశాడు. స్కిట్‌లో భాగంగా మాట్లాడుతూ అషూను చెల్లెమ్మ అని సంబోధించాడు. తారుడబ్బా మొహమోడ ఎవడ్రా నీకు చెల్లెమ్మా అంటూ కాలితో తన్నేసింది అషూ. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు.


Click it and Unblock the Notifications











