తెల్లవారుజామున రాహుల్ కి అషూ మెసేజ్.. చాలా చూశావ్, టేకిట్ ఈజీ అంటూ.. చాట్ బయటపెట్టేసిన రాహుల్!

బిగ్ బాస్ సీజన్ 3 విజేత కావడంతో రాహుల్ సిప్లిగంజ్ కి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు దాకా చాలా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ తెర వెనుకే ఉండిపోయాడు తప్పితే.. తెరపైకి వచ్చింది లేదు. కానీ బిగ్ బాస్ సీజన్ విజేత కావడంతో రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ మరింత పెరిగింది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ షో కి వెళ్లడం ద్వారా లాభపడి.. ఆఫర్లు దక్కించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే అది రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే అని చెప్పక తప్పదు.అయితే తెల్లవారుజామున అషూ రెడ్డి, రాహుల్ మధ్య జరిగిన చాట్ లీక్ చేశారు రాహుల్. ఆ వివరాల్లోకి వెళితే

పునర్నవితో అలా

పునర్నవితో అలా

హౌస్ లో ఉండగా పునర్నవితో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్ బయటకు వచ్చాక మాత్రం ఆమెతో అసలు కనిపించింది లేదు. ఎవరూ ఊహించని విధంగా మనోడు అషురెడ్డితో ఎక్కువగా కనిపిస్తూ ఆమెతో ఫోటోలు పెడుతూ రచ్చ చేస్తున్నాడు. వీళ్ళ మధ్య ఏమయినా ఉందో లేదో తెలీదు కానీ తమ మధ్య ఏదో ఉందనే భ్రమ కల్పించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

అషురెడ్డితో ప్రేమలో

అషురెడ్డితో ప్రేమలో

బిగ్ బాస్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ తనతో పాటు హౌస్ మెట్ అయిన అషురెడ్డితో ప్రేమలో ఉన్నాడేమో అనిపించేలా వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వివిధ రకాల పోస్టులు పెట్టారు. దానికి ఊతం ఇచ్చే లాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, అలాగే అషురెడ్డిని రాహుల్ సిప్లిగంజ్ ఎత్తుకున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.

తెల్లవారుజామున చాటింగ్

తెల్లవారుజామున చాటింగ్


ఇక తాజాగా ఈ ఇద్దరూ అర్దరాత్రి దాటాక చాటింగ్ చేసుకున్నారు. తెల్లవార్జున ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఈ ఇద్దరూ చేసుకున్న చాట్ ను రాహుల్ బయట పెట్టాడు. రాహుల్ సిప్లిగంజ్ ఏదో బాధలో ఉంటే ఆ విషయాన్ని అషూ చెప్పుకున్నారు. దీంతో రాహుల్ బాధను చూసి అషు ఓదార్చే ప్రయత్నం చేసింది. సరే ఎక్కువగా ఆలోచించకు టేక్ ఇట్ ఈజీ, పరిస్థితులు అన్నీ అవే సర్దుకుంటాయి అని అషు ఆభయం ఇవ్వగా కొన్ని పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

Recommended Video

#TNR ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన Artists Association
చాలా చూశావ్

చాలా చూశావ్


అయితే లైఫ్ లో ఇవన్నీ కామన్ అని చెప్పుకొచ్చిన అషు రెడ్డి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని ఇక్కడికి రావడానికి చాలా చూశావ్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకొచ్చింది. దానికి పక్కా అలాగే చేస్తానని చెప్పిన రాహుల్ కచ్చితంగా కేర్ తీసుకుంటాను అని చెబుతూ ఆ స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అయితే ఇంతకీ రాజుల్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటా అనే చర్చ కూడా జరుగుతోంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X