నువ్వు నాకు అక్కర్లేదన్న అషు.. సీరియస్ అయి షో నుంచి వెళ్ళిపోబోయిన రాహుల్.. మళ్లీ మొదలైందా?

తెలుగు బిగ్బాస్ మూడవ సీజన్ లో పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా బయటకు వచ్చాడు. హౌస్ లో ఉన్నన్నాళ్ళు పునర్నవి భూపాలంతో ప్రేమలో ఉన్నట్లు ప్రేక్షకులందరికీ భ్రమ కల్పించారు బిగ్ బాస్ నిర్వాహకులు.. బయటకు వచ్చాక వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ అయిన దాఖలాలు లేవు. కానీ హౌస్ లోనే ఒక కంటెస్ట్ఎంట్ అషురెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ యవ్వారం మాత్రం మధ్య అనుమానం రేకెత్తించింది. అయితే ఇప్పుడు మరో సారి ఆ అంశం తెరమీదకు వచ్చింది..ఆ వివరాల్లోకి వెళితే..

 ఎందుకో అలా

ఎందుకో అలా

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఆయన పునర్నవితో ఎక్కువగా కనిపించలేదు. పునర్నవి స్థానంలో అదే బిగ్ బాస్ హౌస్ లో కొన్నాళ్ళపాటు ఉండి బయటకు వచ్చేసిన అషురెడ్డితో ఫోటోలు పెట్టడం మొదలు పెట్టారు.. దీంతో అషు రెడ్డి అలాగే రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఏదో ఉంది అనే ప్రచారం మాత్రం జరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ స్నేహితులమె అని చెప్పుకుంటూనే మళ్లీ అనుమానాలు రేకెత్తించే విధంగా ఫోటోలు పెట్టే వాళ్ళు..

ఏదో ఉంది అన్నట్టు

ఏదో ఉంది అన్నట్టు

దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే విషయం మీద చాలా చర్చోపచర్చలు జరుగుతూ వచ్చేవి. అషూ రెడ్డి, రాహుల్ మధ్య ఏదో ఉంది అనెట్టు వాళ్ళు ఇద్దరూ ఎందుకో అలా అనుమానాలు రేకెత్తిస్తూ ఉండేవారు. నెట్టింట్లో ఒకానొక సమయంలో వీరిద్దరూ తెగ ట్రెండ్ అయ్యారు కూడా. అసలు ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనీ, ఇంకేముంది పెళ్లి కూడా చేసుకోబోతోన్నారని అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

 రూమర్లకు చెక్ పెట్టీ

రూమర్లకు చెక్ పెట్టీ

నా గుండెల్లో రాహుల్ ఉన్నాడని అషూ చెప్పిన మాటలతో ఆ రూమర్లకు ఇంకా బలం పెరిగింది. అయితే రాహుల్, అషూలు మాత్రం తామిద్దరం మంచి స్నేహితులం, అని మళ్లీ మాటలు చెప్పే వాళ్ళు. నా కోసం మూడు రోజులు షూటింగ్ చేసింది. కానీ ఒక్క రూపాయికూడా తీసుకోలేదని అషూకి నేనంటే అంతా ఇష్టం అంటూ తన ప్రేమను చూపించాడు రాహుల్.

మళ్లీ మొదలైనట్టు

మళ్లీ మొదలైనట్టు

అయితే ఈ ఎపిసోడ్ మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది. సుమ క్యాష్ షోలో తాజాగా ఈ ఇద్దరూ కాస్త ఓవర్ డ్రామా చేశారు. ఎమోషనల్ గా గట్టిగా మాట్లాడుకుంటున్నారు కానీ వీళ్ళను నమ్మలేం, ఏదో స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. అయితే ప్రమొలో మాత్రం నిజంగానే ఈఇద్దరూ గొడవ పెట్టుకున్నారా? అనేంత సీన్ క్రియేట్ చేశారు. నువ్ నాకు అక్కర్లేదు.. అంటూ అషూ అనడం, అలాంటప్పుడు ఈ షోకు నన్ను ఎందుకు పిలవడం అంటూ రాహుల్ అలిగి వెళిపోయాడు.

Recommended Video

O Madhu Movie Trailer Is Out
 అషూ కన్నీరు

అషూ కన్నీరు

అషూ కన్నీరు పెట్టుకున్నట్టు, నువ్వు నాకు అక్కర్లేదు అని ఆమె అనడం సుమ కూడా ఎమోషనల్ అయినట్టు ఓవర్ ప్రోమో కట్ చేశారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. గతంలో ఇలా ప్రోమోలు కట్ చేసి ఎపిసోడ్స్ మీద హైప్ పెంచేవాళ్లు కానీ ఇప్పుడు జనం కూడా ఇలాంటి ప్రోమో లలో హడావుడి తప్ప ఏమీ ఉండదని గుర్తించారు. ఈ ప్రమోలో ఏమున్నది అనేది టెలికాస్ట్ అయితే కానీ చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X