twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

    |

    ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు తెగ పాపులర్ అయ్యారు. తద్వారా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెరపైనో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తోన్నారు. అలాంటి వారిలో విశాఖపట్నం చిన్నది అషు రెడ్డి ఒకరు. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న అమ్మాయి కావడంతో చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా పాపులర్ అయిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం అషు రెడ్డి తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిని మీరూ చూసేయండి!

    అప్పుడే ఫేమస్.. ఆదిలోనే బ్రేక్

    అప్పుడే ఫేమస్.. ఆదిలోనే బ్రేక్

    అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోల వల్ల అషు రెడ్డి వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరగడంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అషు రెడ్డి 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది.

    శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

    బిగ్ బాస్‌తో మొత్తం మారిందిగా

    బిగ్ బాస్‌తో మొత్తం మారిందిగా

    యూఎస్‌లో ఉన్న సమయంలో అషు రెడ్డి గ్లామర్ ఫీల్డుకు దూరంగా ఉంది. అయితే, ఆ తర్వాత ఆమె మరోసారి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది.

    నాన్ స్టాప్‌తోనూ అషుకు నిరాశే

    నాన్ స్టాప్‌తోనూ అషుకు నిరాశే

    మూడో సీజన్‌లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన అషు రెడ్డి.. ఈ ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె మరింతగా రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేటై నిరాశనే ఎదుర్కొంది.

    Sara Ali Khan: స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ డేటింగ్.. నైట్ ఇద్దరూ కలిసి అలా కనిపించడంతో!Sara Ali Khan: స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ డేటింగ్.. నైట్ ఇద్దరూ కలిసి అలా కనిపించడంతో!

    వరుస ఆఫర్లు.. టూర్లతో బిజీగా

    వరుస ఆఫర్లు.. టూర్లతో బిజీగా

    అషు రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తర్వాత మరింత స్పీడు పెంచేసింది. ఈ షో ద్వారా ఎంతో లాభపడిన ఈ భామ.. కెరీర్ పరంగానూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్న ఈ భామ.. తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే అషు రెడ్డి దుబాయ్, మియామీలో కూడా వెళ్లొచ్చింది.

    సోషల్ మీడియాలో హడావిడి

    సోషల్ మీడియాలో హడావిడి

    సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

    పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్పాయల్‌ను ఏమీ లేకుండా చూపించమన్న నెటిజన్: ఆ ఫొటో షేర్ చేయడంతో షాక్

    అందాలను ఆరబోస్తోన్న అషు

    అందాలను ఆరబోస్తోన్న అషు

    చాలా కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి తన అందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలనే వదులుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ క్లీవేజ్ భాగాలు చూపిస్తూ కాక రేపుతోంది. అంతేకాదు, లోదుస్తులతో తన అందాలు అన్నింటినీ చూపిస్తూ హడావిడి చేస్తోంది. ఫలితంగా అషు తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

    షర్ట్ విప్పేసి రచ్చ చేసిందిగా

    షర్ట్ విప్పేసి రచ్చ చేసిందిగా

    అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ బటన్స్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అలాగే, హాట్ హాట్ ఫోజులతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో అషు రెడ్డి వదిలిన ఫొటోలు చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్‌ అయిపోయాయి.

    English summary
    Telugu Actress and model Ashu Reddy Very Active in Social Media. Now She Shares Hot Photos in her Instagram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X