అతన్ని రేప్ చేస్తా.. జైలుకు వెళ్లిన పర్లేదు.. అషురెడ్డి బోల్డ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అషు రెడ్డి టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో జూనియర్ సమంత గా సంచలనం రేపిన ఈ ముద్దుగుమ్మ పాపులర్ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తో బుల్లితెర ఆడియన్స్ కు ఎంతగానో దగ్గర అయింది. అంతకుముందే ఈ బ్యూటీని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీగా మార్చేశారు. ఆ తర్వాత అషు రెడ్డి తన టాలెంట్ తో స్మాల్ స్క్రీన్ పై ఆయా షోలో కనిపిస్తూ సందడి చేస్తుంది.
ప్రస్తుతం అషు రెడ్డి స్టార్ మా లో ప్రసారమవుతున్న ఫ్యామిలీ స్టార్స్ టీవీ షోలో యాంకర్ గా అలరిస్తోంది. బుల్లితెర స్టార్, హీరో సుడిగాలి సుదీర్ తో కలిసి ఆ షోలో ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. తన యాంకరింగ్ స్కిల్స్ ను చూపిస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తన కెరియర్ ను గాడిలో పెట్టేందుకు మరింత జోరుగా ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటుంది. టీవీ స్టార్ గా ప్రస్తుతానికి గుర్తింపును అయితే దక్కించుకుంది.

ఇదిలా ఉంటే అషు రెడ్డి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గురించిన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునేందుకు ఏమాత్రం సంకోచించదు. ఇక అషు రెడ్డి తన స్నేహితుడు, బిగ్బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ విన్నర్, స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా వీరిద్దరూ హౌస్ మెంట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే మంచి స్నేహితులుగా ఏర్పడ్డారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక వీరి కెరియర్ రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది.
ఇక రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి అషు రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె రాపిడ్ ఫైర్ క్వశ్చన్ లకు సమాధానాలు ఇచ్చింది. తన ఎక్కువగా మూగజీవాలను సాధు జంతువులను ప్రేమిస్తానని తెలిపింది. పెళ్లి విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పుకొచ్చింది. అందరితో స్నేహం చేయడం తనకి ఇష్టమైన అని చెప్పింది. స్నేహితులను ఎంతగానో నమ్ముతానని తెలిపింది. ఇక ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్ గురించి పలు ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానాలు ఇచ్చింది.
రాహుల్ సిప్లిగంజ్ తన బెస్ట్ లవ్ అని, ప్రతి విషయంలో అవైలబుల్ గా ఉంటాడని పొగిడింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ ను చేసుకోబోయే అమ్మాయి గురించి అడిగినప్పుడు ఎలా భరిస్తుందోనని ఫన్నీగా బదులిచ్చింది. ఇక ఒకవేళ జైల్లో ఉండాల్సి వస్తే ఏం క్రైమ్ చేసి జైలుకు వెళ్దామని ఇంటర్వ్యూ లో అషు రెడ్డిని అడగ్గా బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ ను రేప్ చేసే జైలుకు వెళ్తానని ఆశ్చర్యకరంగా బదులిచ్చింది. దాంతో అటు రాహుల్ సిప్లిగంజ్ కూడా షాక్ అయ్యాడు. ఇక ఇంత బోల్డ్ గా సమాధానం ఇవ్వడంతో ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రాహుల్ సిప్లిగంజ్ ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ అవార్డు సాంగ్ నాటు నాటుకు గాత్రం అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంబంధించిన పాటలను పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











