అతడితో లవ్ ట్రాకుపై అషు రెడ్డి క్లారిటీ: పదే పదే అలా పిలిచి.. మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అంటూ!

సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది తెలుగు అమ్మాయిలు.. సెన్సేషన్‌గా మారిపోతున్నారు. తద్వారా ఎన్నో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఫలితంగా యూత్ ఐకాన్లుగా ఎదిగిపోతున్నారు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ అషు రెడ్డి ఒకరు. చాలా కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ బ్యూటీ.. విచిత్రమైన తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే కొంత కాలంగా ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అషు రెడ్డి తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

స్విమ్మింగ్ పూల్‌లో నికితా శర్మ.. ఎద అందాలతో అదుర్స్

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు

డబ్‌స్మాష్ వీడియోలు అప్పట్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎంతో పాపులర్ అయిన వీటి ద్వారానే అషు రెడ్డి వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం సమంత ఉండడం వల్లే ఆమెకు భారీ స్థాయిలో పాపులారిటీ ఏర్పడింది. దీంతో ఆమె జూనియర్ సమంతగా పేరు సంపాదించుకుంది. ఈ కారణంగానే యూత్ స్టార్ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది.

బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీ.. ఫుల్ బిజీ అయిందిగా

బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీ.. ఫుల్ బిజీ అయిందిగా

ఒక్క సినిమాలో మాత్రమే నటించిన తర్వాత తెలుగు తెరకు దూరమైంది అషు రెడ్డి. ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం చేస్తూ ప్రేమలో పడడం.. అప్పుడే డిప్రెషన్‌కు గురై లావైపోవడం జరిగాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అషు రెడ్డి.. అప్పటి నుంచి ఆఫర్ల అందుకుంటూ బిజీ అయిపోయింది.

ఎప్పుడూ అందులోనే.. పవన్ వ్యవహారం వల్ల

ఎప్పుడూ అందులోనే.. పవన్ వ్యవహారం వల్ల


అషు రెడ్డి వ్యవహరించే తీరు తరచూ ఆమెను వార్తల్లో నిలిచేలా చేస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు తన ప్రైవేటు పార్టులో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆ సమయంలోనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి బుక్కైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

నిధి అగర్వాల్ క్లీవేజ్ షో.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

ఆ స్టార్స్‌తో అషు రెడ్డి రచ్చ.. వీడియోలు వైరల్

ఆ స్టార్స్‌తో అషు రెడ్డి రచ్చ.. వీడియోలు వైరల్


స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని వీడియోలను వదులుతోంది.

అతడికి హగ్గులు.. ముద్దులు.. ప్రేమాయణంతో

అతడికి హగ్గులు.. ముద్దులు.. ప్రేమాయణంతో


అషు రెడ్డి కామెడీ స్టార్స్‌లో ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది. దీంతో ఆమె కొన్ని స్కిట్లలోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్స్‌ప్రెస్ హరితో స్కిట్ చేసింది. ఇందులో అతడికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న టాక్ వినిపించింది.

ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాకుపై అషు రెడ్డి క్లారిటీ

ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాకుపై అషు రెడ్డి క్లారిటీ


అషు రెడ్డి.. యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వీళ్లంతా కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరితో రిలేషన్‌పై అషు రెడ్డి క్లారిటీ ఇచ్చింది.

Recommended Video

OTT లో Latest Telugu Movies | Zombie Reddy రిలీజ్ ఇన్ Aha
మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అంటూ

మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అంటూ


ఈ లైవ్ జరుగుతోన్న సమయంలో నెటిజన్లు హరితో ప్రేమాయణం గురించి కామెంట్లు చేశారు. దీంతో 'హరి నాకు అన్నయ్య లాంటి వాడు. షో కోసం అలా చేస్తుంటాం. బయట మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉంటాం. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అలాంటిది మాత్రమే. డైరెక్టర్ ఏది చెబితే అలా చేయడం వరకే' అంటూ వివరించింది అషు. దీంతో ప్రేమాయణం పుకార్లకు పుల్‌స్టాప్ పడినట్లైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X