హీరోయిన్‌కు రాహుల్ లిప్ లాక్.. అతని వీడియోలంటే ఆ మాత్రం ఉండాలి.. బిగ్‌బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్
బిగ్‌బాస్ మూడీ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రెండో సీజన్ కంటెస్టెంట్ నందినీ రాయ్ కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ ఆల్బమ్‌లో నందినీ, రాహుల్ రెచ్చిపోయి నటించారు. లిప్ లాక్‌తోనే మొత్తం హీటెక్కిస్తారు. తాజాగా ఇదే వీడియోను ఆ ఇద్దరూ చూసుకుంటూ తెగ సిగ్గు పడిపోయారు. ఈ వీడియోను తాజాగా షేర్ చేసిన రాహుల్.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.దీనికి అషూ రెడ్డి చేసిన కామెంట్స్, రాహుల్ రిప్లై తెగ వైరల్ అవుతోంది. ఆ కథేంటో ఓసారి చూద్దాం.

బిగ్‌బాస్ విన్నర్‌గా ఫుల్ క్రేజ్..
ప్లే బ్యాక్ సింగర్, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో రాహుల్ సిప్లిగంజ్ అంతో ఇంతో ఫేమస్ అయినా కూడా బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ అనే ట్యాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ స్టేటస్‌ను తీసుకొచ్చింది. బిగ్‌బాస్ షో వల్ల అంతకు ముందున్న పాపులార్టి వంద రెట్లు పెరిగింది.

ఫుల్ బిజీగా రాహుల్..
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ ఫుల్ బిజీ అయ్యాడు. ఓ వైపు పాటలు పాడుతూ బిజీగా ఉంటూ.. మరో వైపు నటనలోనూ రంగ ప్రవేశం చేశాడు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగమార్తాండ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
రాహుల్ వీడియో వైరల్..
నందినీ రాయ్‌తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ షేర్ చేశాడు. ఈ వీడియోకు అషూ చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో అషూ చేసిన అల్లరి వేసిన పంచ్‌లు, రాహుల్‌ను ఆట పట్టించిన విధానం అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా తాజాగా ఓ బోల్డ్ కామెంట్ చేసింది.
Recommended Video

అలాంటి మినిమమ్ ఉంటాయ్..
లిప్ లాక్ సీన్‌ను ఉద్దేశిస్తూ.. వావ్ ఇది నేను చూడలే అంటూ సెటైర్ వేసింది. దీనికి స్పందించిన రాహుల్.. అబ్బో ఇక నేను చచ్చిపోతా అంటూ కామెంట్ చేశాడు. మళ్లీ ప్రతీగా స్పందించిన అషూ.. మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో అంటూ నవ్వేసింది.


Click it and Unblock the Notifications











