For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవిపై అషు రెడ్డి షాకింగ్ కామెంట్స్: ఆ లేడీ యాంకర్లతో ఏం చేశాడని అడుగుతూ దారుణంగా!

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో లోకల్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ.. ఇప్పుడు వరుస షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ షోలో యాంకర్‌గానూ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ రవిపై అషు రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  మిస్ ఇండియా బికిని నికితా గోఖలే హాట్ ఫోటోస్.. శృంగార దేవతను మించిన అందంతో...

  అలా పరిచయం... ఇలా పాపులారిటీ

  అలా పరిచయం... ఇలా పాపులారిటీ

  అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో డబ్‌స్మాష్ వీడియోలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వీటి వల్ల ఎంతో మంది అమ్మాయిలు ఫుల్ ఫేమస్ అవగా.. అందులో అషు రెడ్డి ఒకరు. ఈ వీడియాల ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.

  దాని తర్వాత మారిన అషు రెడ్డి కెరీర్‌

  దాని తర్వాత మారిన అషు రెడ్డి కెరీర్‌

  ఒకే ఒక్క సినిమా చేసిన తర్వాత ఒక్కసారిగా తెలుగు వాళ్లకు దూరంగా వెళ్లిపోయింది అషు రెడ్డి. ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం చేసింది. అప్పుడక్కడ ఓ వ్యక్తితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత బ్రేకప్ అవడం.. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురవడం జరిగింది. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో గెలవకపోయినా వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకెళ్తోంది.

  పవన్ పేరును వాడుతూ మరింత క్రేజ్

  పవన్ పేరును వాడుతూ మరింత క్రేజ్

  అషు రెడ్డి పాపులర్ అవడానికి సోషల్ మీడియాలో ప్రధాన కారణం. దాదాపు ఆరేడేళ్లుగా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తన ప్రైవేటు పార్టులో పవన్ పేరుతో టాటూ వేయించుకుని చూపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఆయనను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అలాగే, దూకుడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ.

  అతడితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిందిగా

  అతడితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిందిగా

  స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘కామెడీ స్టార్స్' ద్వారా బుల్లితెరపైనా అషు రెడ్డి బిజీ అయింది. ఇందులో హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరితో రొమాన్స్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల లైవ్ చాట్‌లో హరి తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది.

  కొత్త అవతారంలో అషు... రచ్చ చేస్తూ

  కొత్త అవతారంలో అషు... రచ్చ చేస్తూ

  ఇంత కాలం ఆర్టిస్టుగా సత్తా చాటిన అషు రెడ్డి.. ఇటీవలే యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఆమె యాంకర్ రవితో కలిసి ‘హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. జబర్ధస్త్ అజయ్ కీలక పాత్రను చేస్తున్నాడు. ఇందులో రవితో కలిసి ఆమె రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, స్టూడెంట్స్‌తోనూ ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది.

  రవిపై అషు రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

  రవిపై అషు రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

  గురువారం ప్రసారం కానున్న ‘హ్యాపీ డేస్' షోలో అషు రెడ్డి తనదైన పంచులతో సత్తా చాటింది. ఇక, స్టూడెంట్స్ అడిగే ప్రశ్నలకు అదిరిపోయే ఆన్సర్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి యాంకర్ రవి గురించి ఓ ప్రశ్న అడగగా.. దానికి అషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగుతో రెచ్చిపోయింది. దీంతో యాంకర్ రవి బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. ఇది ప్రోమోలో కూడా చూపించారు.

  ఆ యాంకర్లతో ఏం చేశాడని అడుగుతూ

  ఆ యాంకర్లతో ఏం చేశాడని అడుగుతూ

  షోలో భాగంగా ఓ స్టూడెంట్ రవిని ‘మీరు చాలా మంది యాంకర్లతో చేశారు కదా' అని ఏదో అడగబోయింది. అంతలో అందుకున్న అషు రెడ్డి ‘యాంకర్లతో ఏం చేశాడు' అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడింది. దీంతో రవి తెల్లముఖం వేసి ఆమెను అలాగే చూస్తుండిపోగా.. స్టూడెంట్స్ అంతా ఆ బూతు డైలాగ్ అర్థమై తెగ నవ్వుకున్నారు. దీంతో అషుపై విమర్శలు వస్తున్నాయి.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Now Doing Happy Days Daily Show. In This Show She Shocking Comments on Anchor Ravi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X