బిగ్‌బాస్ నుంచి జిగేల్ రాణి అవుట్.. సెలబ్రీటీలంతా ఫుల్ హ్యాపీ.. ఒక్కరే కంటతడి!
Recommended Video
బిగ్‌బాస్‌లో ఆదివారం ఎలిమినేషన్ కావడంతో ఎపిసోడ్ కీలకంగా మారింది. ఇంటి సభ్యులతో హోస్ట్ నాగార్జున ఆటలు ఆడిస్తూనే ఒక్కొక్కరిని సేఫ్ చేశాడు. ఆదివారం ఎపిసోడ్‌లో సరదా సరదాగా మూడు రకాలు గేమ్స్ ఆడించి ఆటగాళ్ల తీరును బయటపెట్టారు. ఇక వారం ఇంటి నుంచి అషు రెడ్డిని బయటకు పంపించే కార్యక్రమాన్ని నాగార్జున చాలా స్మూత్‌గా నిర్వహించారు. అశు రెడ్డిని ఎలా బయటకు పంపించారంటే..

జంతువుల మాదిరిగా బిహేవ్ చేసే
హోస్ట్ నాగార్జున వేదికపైకి రావడంతోనే డైరెక్ట్‌గా ఇంటి సభ్యులతో మాట్లాడటం ప్రారంభించాడు. తొలి ఆటగా జంతువుల లక్షణాలతో కూడిన ఇంటి సభ్యులు గుర్తించి.. ఎవరైతే ఏ జంతువుగా బిహేవ్ చేస్తారో వారికి అలాంటి మాస్క్‌ను ముఖానికి తగిలించాయి. ఈ ఆట కోసం కెప్టెన్ శివజ్యోతికి నాగార్జున ఫుల్ పవర్స్ ఇచ్చారు.

శివజ్యోతికి ఫుల్ పవర్స్
ఇక శివజ్యోతి పవర్ ఫుల్‌గా ఇంటి సభ్యులను జంతువులతో కూడిన లక్షణాలను గుర్తించింది. మృగరాజుగా అలీ, నక్క జిత్తుల మారి వ్యక్తిగా, ఊసరవెళ్లిగా గుర్తించి బాబా భాస్కర్‌కు అలాంటి మాస్క్‌లు పెట్టించారు. అలా ఒక్కొక్కరికి వితికకు కుందేలు, అశురెడ్డికి ఏనుగు లాంటి మాస్కులను తగిలించారు. ముఖ్యంగా ఈ గేమ్‌లో బాబా భాస్కర్‌ను శివజ్యోతి టార్గెట్ చేసినట్టుగా కనిపించారు.

బాబా, పునర్నవి, రాహుల్ సేఫ్
ఆ తర్వాత గేమ్ మధ్యలో మొదట బాబా భాస్కర్‌ను, ఆ తర్వాత పునర్నవిని సేఫ్ చేశారు. అలా జంతువుల ఆటను కొనసాగిస్తూనే మధ్య మధ్యలో పాటలకు డ్యాన్స్‌లు చేయిస్తూ గేమ్‌ను మరింత రంజుగా మార్చారు. ఈ గేమ్‌లో శ్రీముఖి, వితిక, బాబా భాస్కర్, మహేష్ ఆకట్టుకొన్నారు. అనంతరం రాహుల్‌ను సేఫ్ చేశారు.

మరో ఆసక్తికరమైన గేమ్‌తో
ఇక రెండో గేమ్‌గా నాలా నువ్వు అనే గేమ్‌ను ఆడించారు. ప్రతీ ఒక్కరికి తమ పేరును ఉన్న ప్లకార్డును మెడలో వేసుకోవాలి. ఆ తర్వాత దానిని తప్పితే వచ్చే పేరున్న వ్యక్తిగా యాక్టింగ్ చేయాలి. ఈ గేమ్‌లో ఇద్దరిద్దరిని జంటలుగా విభజించారు. మొత్తంగా వితిక, అలీ జంట, శ్రీముఖి రాహుల్ జంట మస్తుగా వినోదాన్ని పంచింది. ముఖ్యంగా అలీ వితికగా యాక్ట్ చేసి అందర్నీ ఆకట్టుకొన్నాడు.

ఇంటి నుంచి అశురెడ్డి అవుట్
ఇక ఆట మధ్యలో హిమజ, అశురెడ్డి ఎలిమినేషన్‌లో మిగిలారు. దాంతో ఇద్దరిలో ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఆసక్తిగా మారింది. ఇద్దరిని కొంత టెన్సన్ పెట్టి అశురెడ్డిని ఎలిమినేషట్ చేశారు. అనంతరం అశురెడ్డిని సెల్పీదిగి బయటకు రావాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ఆశురెడ్డిలో బాధ కనిపించలేదు. ఇంటి సభ్యులకు హ్యాపీ మూడ్‌లోనే ఉన్నారు. ఒక్క శివజ్యోతి మాత్రమే కంటతడి పెట్టింది. డ్యాన్సులు చేస్తూ అశురెడ్డిని బయటకు పంపారు.

ఎమోషనల్ జర్నీతో
ఇక వేదిక మీద తన మూడు వారాల జర్నీ చూసిన అశురెడ్డి ఉద్వేగానికి గురైంది. అనంతరం హోస్ట్ నాగార్జున ఆడించిన గేమ్‌లో పాల్గొన్నది. ఇంటి సభ్యుల ఫొటోలు పెట్టి వారిలో బిగ్‌బాస్‌లో ఉండేలా అర్హత ఎవరికి ఉంది. ఎవరికి లేదో డిసైడ్ చేసి.. అర్హత ఉంటే ఫోటోను సెల్ఫ్‌లో పెట్టాలని, లేకపోతో కింద పడేసి పగులకొట్టాలని సూచించారు.

అర్హత లేని.. అర్హత ఉన్న లిస్టులో
బిగ్‌బాస్ గేమ్‌లో అర్హత ఉండే వారి లిస్టులో శివజ్యోతి, శ్రీముఖి, పునర్నవి, అలీ, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ ఉండాలని.. మహేష్, హిమజ, రాహుల్, వితికలకు ఇంటిలో ఉండే అర్హత లేదని చెప్పింది. దాంతో గేమ్ అయిపోవడంతో నాగార్జునతో కలిసి సెల్ఫీ దిగి బిగ్‌బాస్‌లో తన జర్నీని ముగించింది.


Click it and Unblock the Notifications











