బిగ్ బాస్ హౌస్‌లో థర్డ్ పార్టిసిపెంట్.. డబ్ స్మాష్ అషు రెడ్డి హంగామా
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో థర్డ్ పార్టిసిపెంట్ అషు రెడ్డి అడుగు పెట్టారు. ఈమెను బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. అషు రెడ్డి గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

అషు రెడ్డి.. అషు రెడ్డి.. యు ట్యూబ్ లో డబ్ స్మాష్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయింది. ఈమెకు జూనియర్ సమంత అనే పేరు కూడా ఉంది. సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన ఈమె ఎంతో కలర్ ఫుల్ డ్రెస్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. ఆమె రాగానే వావ్.. బ్యూటిఫుల్ అంటూ ఆమెకు వెల్ కమ్ చెప్పారు నాగ్. ఆమె లైఫ్ లో లవ్ బ్రేక్ అప్ జరిగిందని, ఆ టైమ్ లో డిప్రెషన్ లోకి వెళ్లానని అషు రెడ్డి పేర్కొంది. సావిత్రి, రవికృష్ణ ఇద్దరూ అషు రెడ్డిని హౌస్ లోకి స్వాగతం పలికారు.


Click it and Unblock the Notifications











