Bigg Boss Non Stop నేను బత్తాయి లాంటి దానిని.. పిండేసుకొంటారా? అషు రెడ్డి బోల్డ్ కామెంట్

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో నాన్ స్టాప్‌లో కంటెస్టెంట్లు హాట్ హాట్ చర్చలతో కేక పుట్టిస్తున్నారు. బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. 24 గంటలపాటు లైవ్ స్ట్రీమింగ్ కావడంతో కంటెస్టెంట్ల ఘాటైన వ్యాఖ్యలు ప్రేక్షకులకు జోష్‌ను పెంచుతున్నాయి. అయితే బిగ్‌బాస్‌లో కంటే ఓటీటీ షోలో బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆషు రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో


బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకొన్న అషు రెడ్డి గట్టిగానే ఆకట్టుకొన్నది. అయితే ప్రేక్షకుల ఆదరణ పెరిగే క్రమంలోనే వరుసగా నామినేట్ కావడం, దాంతో తొందరగానే ఎలిమినేట్ అయింది. అయితే బిగ్‌బాస్‌లో అషు రెడ్డి గ్లామర్ షో వ్యవహారం హాట్ టాపిక్ అయింది. బిగ్‌బాస్ షోకు ముందు పెద్దగా పాపులారిటీ లేని ఈ భామ ఆ తర్వాత టాప్ సెలబ్రిటీగా మారిపోయింది.

సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ

సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ


బిగ్‌బాస్ తర్వాత అషు రెడ్డికి సోషల్ మీడియాలో భారీగా పాపులారిటీ లభించింది. తన గ్లామర్ షోతో గణనీయంగా అభిమానులను ఆకట్టుకొన్నారు. రియాలిటీ షోలు, టెలివిజన్ షోలలో పాల్గొంటూ తన పాపులారిటీని మరింత పెంచుకొన్నారు. అయితే బిగ్‌బాస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయిన అషురెడ్డికి మళ్లీ ఓటీటీ ద్వారా నాన్ స్టాప్ షోలోకి వెళ్లే అవకాశం లభించింది.

బిగ్‌బాస్ ఓటీటీ షోలోకి ఎంట్రీ

బిగ్‌బాస్ ఓటీటీ షోలోకి ఎంట్రీ


ఇక బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ షోలో ది వారియర్స్ జట్టు సభ్యురాలిగా, షోలో మొదటి కంటెస్టెంట్‌గా వేదికపైకి వచ్చింది. గతంలో బిగ్‌బాస్‌లో రాణించలేకపోయాను. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటాను. నాపై అభిమానులు పెట్టుకొన్న అంచనాలను అందుకొనేందుకు ప్రయత్నిస్తాను అనే విధంగా అషు రెడ్డి చెప్పింది. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టగానే తన మార్కు గ్లామర్ షో, డైలాగ్స్‌తో రచ్చ లేపుతున్నది.

నేను బత్తాయి లాంటి దానిని..

నేను బత్తాయి లాంటి దానిని..


బిగ్‌బాస్ నాన్ స్టాప్ రెండో రోజు షోలో అషు రెడ్డి మాటలు ఇంటి సభ్యులనే కంగారు పెట్టించాయి. నేను బత్తాయి లాంటి దానిని అంటూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో పక్కనే ఉన్న అఖిల్ అదో రకంగా నవ్వగానే.. బత్తాయి అంటే మరో రకంగా ఉంటుంది అని మరో కంటెస్టెంట్ అన్నారు. దాంతో బత్తాయిలను పిండేసుకొంటారా అని డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కేక పుట్టించింది. దాంతో ఈ టాపిక్ ఎటో పోతున్నదంటూ బత్తాయి మాటను మార్చింది.

నేను మిరపకాయ లాంటి దానిని

నేను మిరపకాయ లాంటి దానిని


అఖిల్, యాంకర్ శివ, అజయ్‌తో మాట్లాడుతూ.. నేను బత్తాయిని కాదు.. కూరగాయల లాంటి దానిని. నేను మిర్చిని. నోట్లో వేసుకొంటే మంట పుట్టిస్తాను. కూరలో వేసుకొంటే రుచిగా ఉంటాను అంటూ అషు రెడ్డి కవరింగ్ చేసే ప్రయత్నం చేసింది. దాంతో నీవు ఏదో మాట్లాడాలని అనుకొన్నావు.. ఏదేదో మాట్లాడుతున్నావు అంటూ అషు రెడ్డిని ఆటపట్టించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X