జూనియర్ సమంతకు నెటిజన్ తింగరి ప్రశ్న.. అక్కడ సర్జరీ చేయించుకొన్నావా? అంటూ అషురెడితో చిలిపిగా!

టెలివిజన్ రంగంతోపాటు సినిమా పరిశ్రమలో రాణిస్తున్న వర్థమాన తార అషురెడ్డి. జూనియర్ సమంతగా పేరు సంపాదించుకొన్న ఈ బ్యూటీ అందచందాలతో అభిమానులను సంపాదించుకొంటున్నది. అయితే ఈ పొడుగు కాళ్ల సుందరి మాత్రం తెర మీద కనిపించడం తక్కువే గానీ.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపుతూ కనిపిస్తుంది. తాజాగా అషురెడ్డి చేసిన పోస్టుపై కొన్ని మంచి కామెంట్లు, మరికొన్ని ట్రోల్స్ కనిపించాయి. అయితే ఓ తింగరి అభిమాని అడిగిన ప్రశ్న వైరల్ అయింది. ఆ ప్రశ్న ఏమిటి? ఆమె పోస్టు చేసిన ఫోటోల కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూనే టిక్ టాక్, షార్ట్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె చేసిన వీడియోలకు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడంతో సినీ ప్రముఖుల కంట్లో పడింది. దాంతో తనకు నచ్చిన సినిమాలను అంగీకరించే క్రమంలో నితిన్‌తో కలిసి చల్ మోహన రంగా సినిమాలో, అలాగే ఫోకస్ సినిమాలో నటించింది.

Bigg Boss Contestant Ashu Reddy gets unusual question from Netizen on post of Dark and Hot in Instagram

అయితే సినిమా రంగంలో అడుగుపెట్టినా అంతగా పాపులారిటీ తెచ్చుకోలేకపోయింది. అయితే బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్‌లో అడుగుపెట్టిన తర్వాత ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అందంతోనే కాకుండా ఆటతీరుతో బిగ్‌బాస్ అభిమానులను గెలుచుకొన్నది.

అయితే బిగ్‌బాస్ షో తర్వాత రాంగోపాల్ వర్మతో చేసిన వీడియో ఇంటర్వ్యూతో ఎక్కడలేని అభిమానులు పుట్టుకొచ్చారు. ఆ వివాదాస్పద ఇంటర్వ్యూలో అషురెడ్డి కాళ్లు ఆర్జీవి నాకడం సంచలనం రేపింది. ఆ తర్వాత ఆమె టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. అయితే పెద్దగా ఆమె సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నట్టు ఏ కోణంలో కూడా అనిపించడం లేదనేది తాజా అంశం.

ఇక అషు రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. తన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తే.. భారీగా వ్యూస్, కామెంట్స్ వస్తుంటాయి. అషురెడ్డికి ఉన్న ఫాలోయింగ్‌ను మాటల్లో చెప్పలేం. ఆమె విదేశీ ప్రయాణాలు చేస్తే పెట్టే వీడియోలకు రికార్డు వ్యూస్ లభిస్తుంటాయి.

తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో అషురెడ్డి ఓ పోస్టు పెడుతూ.. డార్క్ అండ్ బోల్డ్ అంటూ కామెంట్ చేసింది. దాంతో పాటు హాట్ హాట్‌గా దిగిన ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఎండాకాలాన్ని మించిన వేడిని క్రియేట్ చేసింది. అయితే ఆమె ఎద అందాలకు ముగ్డుడైనా ఓ నెటిజన్ తన అనుమాన్ని పోస్టు రూపంలో పెట్టాడు. మీరు బ్రెస్ట్ సర్జరీ చేయించుకొన్నారా? అంటూ కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ వైరల్ అయింది. అయితే ఈ ప్రశ్నపై అషురెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X