తొలిసారి అలా రెచ్చిపోయిన అషురెడ్డి: అతడికి హగ్గులు, ముద్దులు.. అందుకే చేశానంటూ మేటర్ లీక్ చేసింది

అషు రెడ్డి.. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోవడమే. అప్పట్లో విపరీతమైన ట్రెండ్ సెట్ చేసిన డబ్‌స్మాష్ వీడియోలతో ఈ అమ్మడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండే ఈ బ్యూటీ.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక, ఇటీవల బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో అషు రెడ్డి తాజాగా ఓ కమెడియన్‌కు హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అషు రెడ్డి అలియాస్ జూనియర్ సమంత

అషు రెడ్డి అలియాస్ జూనియర్ సమంత

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఫేమస్ అయిపోయారు. అందులో అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోల పుణ్యమా అని ఆమె చేసిన క్లిప్పులకు విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ తెలుగమ్మాయికి జూనియర సమంత అనే పేరు కూడా దక్కింది. ఈ పాపులారిటీతోనే నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది.

ఆమెను అలా చూసి భయపడిపోయారు

ఆమెను అలా చూసి భయపడిపోయారు

కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన తర్వాత అషు రెడ్డి తెరకు దూరమైపోయింది. అదే సమయంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లడమే. ఇక, అక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో కూడా పడింది. కానీ కొద్ది రోజులకే అతడితో బ్రేకప్ అయింది. అప్పుడే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి.. బాగా లావైపోయింది. ఈ విషయాలను అషునే స్వయంగా చెప్పింది.

అప్పటి నుంచి మొత్తం మారిపోయిందిగా

అప్పటి నుంచి మొత్తం మారిపోయిందిగా

సోషల్ మీడియాలో ఫాలోయింగ్.. సినిమాలో యాక్టింగ్ చేసి గుర్తింపును అందుకోవడంతో రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది అషు రెడ్డి. ఆ సమయంలో ఆమె అందానికి మాత్రం చాలా మంది ఫిదా అయ్యారు. అందులో ఆట పరంగానూ చక్కగా రాణించడంతో ఈ అమ్మడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిపోయింది.

అక్కడ ఫుల్ బిజీ... అది చూపించడంతో

అక్కడ ఫుల్ బిజీ... అది చూపించడంతో

బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. దీనికి కారణం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అవడమే. దీంతో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంటోంది. మరీ ముఖ్యంగా తన బాడీపై ఉన్న పవన్ కల్యాణ్ టాటూను పదే పదే చూపించడంతో అమ్మడు మరింత ఫేమస్ అయింది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అందులో చేరిన అషు.. వాళ్లతో హల్‌చల్

అందులో చేరిన అషు.. వాళ్లతో హల్‌చల్

స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని వీడియోలను వదులుతోంది.

మొదటిసారి అలా రెచ్చిపోయిన అషురెడ్డి

మొదటిసారి అలా రెచ్చిపోయిన అషురెడ్డి

అషు రెడ్డి కామెడీ స్టార్స్‌లో ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది. దీంతో ఆమె కొన్ని స్కిట్లలోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం ఆమె ఎక్స్‌ప్రెస్ హరితో స్కిట్ చేసింది. ఇందులో అతడికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అయిపోతోంది.

అందుకే చేశానంటూ మేటర్ రివీల్ చేసింది

అందుకే చేశానంటూ మేటర్ రివీల్ చేసింది

అషు రెడ్డి తొలిసారి ఓ వ్యక్తికి ముద్దులు పెట్టడంపై సోషల్ మీడియాలో విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టును షేర్ చేస్తూ.. 'అన్నా.. డైరెక్టర్ ఏమి చేయమని చెబితే.. అదే చేస్తాము' అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో షోలో జరిగే విషయాలన్నీ కల్పితాలే అని పరోక్షంగా వెల్లడించింది. మొత్తానికి అషు ఫ్యాన్స్ మాత్రం నిరాశగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X