Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!
సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా అటు సినిమాల్లోనో, ఇటు టీవీ కార్యక్రమాల్లోనో భాగం అవుతూ ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈ అమ్మడికి అదిరిపోయే గుర్తింపు దక్కింది. అదే సమయంలో ఆఫర్లు కూడా వెల్లువెత్తాయి. దీనికితోడు దూకుడైన స్వభావంతో తెగ హడావిడి చేస్తుంటుంది కావడంతో ఈమె పేరు తెగ హైలైట్ అవుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. తాజాగా టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఒక మెసేజ్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి!

అప్పుడే ఫేమస్.. ఆఫర్ల వర్షం
డబ్‌స్మాష్ వీడియోలతో ఫుల్ ఫేమస్ అయిన అషు రెడ్డికి జూనియర్ సమంత అనే పేరు దక్కింది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించి మెప్పించింది. తద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లడంతో కెరీర్‌కు బ్రేక్ పడిపోయింది.

బిగ్ బాస్ తర్వాత మరింతగా
లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి వచ్చిన అషు రెడ్డి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'హ్యాపీ డేస్' షో చేసింది. అలాగే, 'కామెడీ స్టార్స్'లోనూ సందడి చేసింది. అప్పటి నుంచి వరుసగా షోలను చేస్తూ మరింతగా ఫేమస్ అయింది.

ఓటీటీ సీజన్‌లోనూ నిరాశగా
బిగ్ బాస్ మూడో సీజన్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన అషు రెడ్డికి ఇటీవలే స్ట్రీమింగ్ అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. ఇందులో ఆమె మరింతగా రచ్చ చేసింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి మరింత హైలైట్ అయింది. కానీ, ఈ సీజన్‌లో కూడా ఈమె మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

షో తర్వాత బిజీ.. టూర్లతోనే
అషు రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ తర్వాత స్పీడు పెంచేసింది. దీని ద్వారా బాగానే రెమ్యూనరేషన్ అందుకున్న ఈ చిన్నది.. తరచూ విదేశీ ట్రిప్‌లకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో ఎన్నో సినిమాలు, షోల ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో అటు కెరీర్ పరంగా.. ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ఈ అమ్మడు తనదైన శైలిలో దూసుకుపోతూనే ఉంది.

సోషల్ మీడియాలో సందడి
బోల్డు బ్యూటీ అషు రెడ్డి సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. అందుకే దీనివల్లే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

విజయ్ ఫ్యాన్స్‌కు ఆ మెసేజ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, చాలా అంశాలపై తనదైన శైలిలో మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఓ మెసేజ్ ఇచ్చింది. ఎందుకంటే ఆమెను కొందరు ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారట. దీనిపై తాజాగా ఓ పోస్ట్ చేసింది.

శాంతించండి అంటూ ట్యాగ్
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అషు రెడ్డి 'విజయ్ దేవరకొండ అభిమానులందరికీ.. కొంత మంది నన్ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి పోస్టులు చేస్తున్నారు. కానీ, నాకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదు. శాంతి' అని స్టోరీగా పెట్టుకుంది. తద్వారా తన పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ మాత్రం చేయవద్దంటూ మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











