అషు రెడ్డి ‘కామం’ వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు అమ్మాయిలు చాలా మందే ఎనలేని గుర్తింపుతో ఫుల్ ఫేమస్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. కొన్నేళ్లుగా టీవీ షోలు, సినిమాలతో తెగ హడావిడి చేస్తోన్న ఈ చిన్నది.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రీల్‌ను షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి!

అప్పుడే ఫేమస్.. సినిమా ఛాన్స్

అప్పుడే ఫేమస్.. సినిమా ఛాన్స్

చాలా కాలం క్రితమే హల్‌చల్ చేసిన డబ్‌స్మాష్ వీడియోల వల్లే అషు రెడ్డి ఫేమస్ అయింది. దీనికి కారణం ఆమె చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడమే. అలా చాలా రోజుల పాటు తెగ సందడి చేసిన ఈ భామకు బుల్లితెరపై, వెండితెరపై చాలా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే అషు 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత చదువు కోసం యూఎస్ వెళ్లింది.

బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్

బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్

ఒక్క సినిమా మాత్రమే చేసి గ్యాప్ తీసుకున్న అషు రెడ్డి.. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆఫర్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను బాగానే పెంచుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు చేసింది. అలాగే, కొన్ని షోలు, ఈవెంట్లలోనూ చాలా సందడి చేసి హైలైట్ అవడంతో పాటు ఫేమస్ అయిపోయింది.

రీఎంట్రీలో మాత్రం భారీ దెబ్బ

రీఎంట్రీలో మాత్రం భారీ దెబ్బ

బిగ్ బాస్ షోలో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన అషు రెడ్డి.. ఈ ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా మరో ఛాన్స్ అందుకుంది. ఇందులో మాత్రం తనదైన వ్యవహార శైలితో బాగా ఫోకస్ అయింది. ఫలితంగా చివరి వరకూ షోలో కొనసాగుతూ వచ్చింది. కానీ, ఈ సీజన్‌లో కూడా అషు రెడ్డి ఫినాలేకు చేరకుండానే ఎలిమినేట్ అయి నిరాశనే ఎదుర్కొంది.

ఫారెన్ ట్రిప్స్.. చిల్ అవుతోంది

ఫారెన్ ట్రిప్స్.. చిల్ అవుతోంది

అషు రెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తర్వాత చాలా ఆఫర్లను సొంతం చేసుకుంది. అదే సమంయలో తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొస్తోంది. అలాగే, ఇప్పుడు కూడా విదేశాల్లోనే తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, తన ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా చిల్ అవుతూ పర్సనల్‌ లైఫ్‌ను ఓ రేంజ్‌లో గడుపుతోంది.

సోషల్ మీడియాలో హడావిడిగా

సోషల్ మీడియాలో హడావిడిగా

సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది.

‘కామం’ రీల్ షేర్ చేసిందిగా

‘కామం’ రీల్ షేర్ చేసిందిగా

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా అషు రెడ్డి తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ రెచ్చిపోతోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ మరింతగా హద్దు దాటుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'కామా తురాణాం న: భయం.. న: లజ్జ' అంటూ సాగే ఓ సినిమా డైలాగ్‌‌కు సంబంధించిన రీల్‌ను అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

వాళ్లకు మాత్రమే అంటూనే

అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీల్‌ను షేర్ చేస్తూ 'నా ప్రొఫైల్‌లో తరచూ నా గురించి చెడుగా కామెంట్లు చేస్తున్న వాళ్లకు ఇది అంకితం' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. అంతేకాదు, చాలా మంది ఈ పోస్టుకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అషును ఘోరంగా తిట్టేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X