బ్రేకప్, డిప్రెషన్‌లతో విషాదం.. అందుకే అలాంటి వాటి జోలికి వెళ్లడం లేదంటోన్న అషూ!
అషూ రెడ్డి అంటే బిగ్ బాస్ బ్యూటీగానే కాకుండా జూనియర్ సమంత, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా చాలా మందికి తెలుసు. డబ్ స్మాష్ కాలం నడుస్తుండగా జూనియర్ సమంతగా కొన్ని లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. అలా వచ్చిన క్రేజ్ వల్లే బిగ్ బాస్ తలుపులు తెరుచుకున్నాయి. ఇక బిగ్ బాస్‌లో అషూ చేసిన అల్లరికి అంతా ఫిదా అయ్యారు. వ్యక్తిగత జీవితం గురించిచెప్పి అందర్నీ కంటతడి కూడా పెట్టించింది.

బిగ్ బాస్‌లో సందడి..
బిగ్ బాస్ మూడో సీజన్‌లో అషూ రెడ్డి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రోహిణి, అషూ, హిమజ, శివజ్యోతి చేసిన హంగామా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. బాబా మాస్టర్ వీరందరితో కలిసి ఫన్ క్రియేట్ చేయడం ఫుల్ వైరల్ అయింది. హౌస్‌లో చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

బ్రేకప్, డిప్రెషన్..
ఒకప్పుడు అషూ జీరో సైజ్‌లోనే ఉండేది. అయితే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చే సమయానికి మాత్రం బాగా బొద్దుగా తయారైంది. దానికి కారణం వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులే. బ్రేకప్ అవ్వడం, దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లడంతో అలా అయ్యానని షోలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

రాహుల్‌తో క్లోజ్..
షో నుంచి బయటకు వచ్చాక అషూ.. రాహుల్ సిప్లిగంజ్‌తో బాగా క్లోజ్ అయింది. ఒకానొక దశలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు కూడా వచ్చాయి. కానీ తామిద్దరం మంచి దోస్తులమేనని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక అషూ సైతం అదే సమాధానాన్ని ఇచ్చింది. కానీ అషూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. తాను రిలేషన్ షిప్‌లో లేకపోవడానికి కారణాలను వివరించింది.
Recommended Video

అందుకే నో రిలేషన్..
‘రాత్రంతా పడుకోకుండా చాటింగ్, మాట్లాడటం నావల్ల కాదు.. రిలేషన్ షిప్‌లో ఈ మధ్య మోసాలు, అబద్దాలే ఎక్కువ అయ్యాయి..గతంలో ఎదురైన అనుభవాలు కూడా నన్ను వెనక్కి లాగుతున్నాయి..నాకు అసలే ఓపిక ఉండదు.. కానీ కొందరు గంటల తరబడి ఎలా మాట్లాడతారో.. రిలేషన్ షిప్ స్టార్ట్ చేయాలనే ఫీలింగే నాకు రావడం లేదు.. సింగిల్‌గానే హ్యాపీగా ఉన్నాను..' అనే కొటేషన్‌లను అషూ పోస్ట్ చేసింది. అంటే అషూ ఫీలింగ్స్ కూడా ఇవేనన్న మాట.


Click it and Unblock the Notifications











